వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజాయితీకి నిలువుటద్దం పవన్ కల్యాణ్ -వ్యక్తిత్వంపై మాట్లాడితే ఖబర్దార్ -ప్రకాశ్‌రాజ్‌కు బండ్ల గణేష్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత అభ్యర్థులను బరిలోకి దింపి, తర్వాత బీజేపీకి ఓటేయాలంటూ తన కార్యకర్తకు పిలుపునిచ్చిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను రంగులు మార్చే ఊసరవెల్లితో పోల్చుతూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పం అయ్యాయి. దీనికి.. సర్కారంలేని, దర్శకనిర్మాతల్ని పీడించుకుతినే వ్యక్తి ప్రకాశ్ రాజ్ అంటూ పవన్ సోదరుడు నాగబాబు ఘాటు రిప్లై ఇవ్వగా, ఇప్పుడు పవన్ భక్తుడినని చెప్పుకునే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సైతం రియాక్ట్ అయ్యారు. మంగళవారం వరుస ట్వీట్లతో గణేష్.. పవన్, ప్రకాశ్ రాజ్ లను ట్యాగ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కారు ఆదేశాలు -ఈనెల 21 నుంచే -దేశంలో తొలిసారిగా..ఏపీలో మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కారు ఆదేశాలు -ఈనెల 21 నుంచే -దేశంలో తొలిసారిగా..

కాబట్టే ఇన్నాళ్లూ మౌనం..

కాబట్టే ఇన్నాళ్లూ మౌనం..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుని, బీజేపీకి మద్దతు పలికిన నేపథ్యంలో పవన్ నేరుగా బీజేపీలో చేరితే సరిపోతుంది కదాని ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేయడం, పవర్ స్టార్ వ్యక్తిత్వాన్ని సైతం ప్రశ్నించడం తెలిసిందే. మంగళవారం గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసన కొద్ది సేపటికే బండ్ల గణేష్ వరుస పోస్టులు పెట్టారు. ఎన్నికల సమయం కాబట్టే ఇన్నాళ్లూ రాజకీయాలు గురించి తానేమీ మాట్లాడలేదని గుర్తుచేస్తూ ప్రకాశ్ రాజ్ పై ఈ విధంగా ఫైరయ్యారు..

నిజాయితీకి నిలువటద్దం..

నిజాయితీకి నిలువటద్దం..

‘‘నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను. పొలిటికల్ గా పవన్ కల్యాణ్ గురించి ఎవరు, ఏదైనా మాట్లాడొచ్చు. ఆయనపై ఎన్నైనా రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ పవన్ వ్యక్తిత్వం గురించి ఎవరు మాట్లాడినా నేను సహించబోను. ఎలక్షన్ టైం లో మాట్లాడటం ధర్మం కాదని ఇప్పటిదాకా రాజకీయాలు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఒకటి మాత్రం కచ్చితగా చెబుతున్నాను.. పవన్ కల్యాణ్ నిజాయితీకి నిలువుటద్దం. ఆయన..

ఇండస్ట్రీలో ఎంతోమందికి ఊతం..

ఇండస్ట్రీలో ఎంతోమందికి ఊతం..

పవన్ కల్యాణ్ నిజాయితీ, నిబద్ధత ఏంటో నాకు బాగా తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు, ఇంకెంతో మంది సాంకేతిక నిపుణుల్ని, నిర్మాతలను పరిచయం చేసిన ఘనత నా దైవం పవన్ కల్యాణ్ కే దక్కుతుంది. నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి.. నాకు ఆయన పెట్టిన భిక్షే. కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది. పవన్ ఎప్పటికీ నాకు దైవంతో సమానం'' అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో లేకున్నా హాట్ టాపిక్

రాజకీయాల్లో లేకున్నా హాట్ టాపిక్

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, సొంత నియోజకవర్గం షాద్ నగర్ లో టికెట్ ఆశించినా దక్కకపోవడం, నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో పీక కోసుకుంటానని ఛాలెంజ్ చేయడం, కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడం తెలిసిందే. రాజకీయాల్లో లేనప్పటికీ గణేష్ తరచూ పొలిటికల్ హాట్ టాపిక్ గా కొనసాగుతున్నారు. ఆ మధ్య చాలా మంది నేతలు బ్లేడ్ కామెంట్లను ప్రస్తావించగా, తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని కమెడియన్ గా పేర్కొంటూ బండ్ల గణేష్ తో పోల్చారు. తాను జోకర్ కాదు.. ఫైటర్ అని కవితకు బండ్ల కౌంటరిచ్చారు. తాజాగా పవన్ పై నోరుపారేసుకున్న ప్రకాశ్ రాజ్ కు కూడా గణేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

నిమ్మగడ్డకు జగన్ మరో షాక్ -స్థానిక ఎన్నికలపై హైకోర్టులో సర్కారు పిటిషన్ -సుప్రీం తీర్పుతో ఆటలా?నిమ్మగడ్డకు జగన్ మరో షాక్ -స్థానిక ఎన్నికలపై హైకోర్టులో సర్కారు పిటిషన్ -సుప్రీం తీర్పుతో ఆటలా?

Recommended Video

Vijayasai Reddy - 'భవిష్యత్తులో ప్రతిపక్షం ఉంటేనే కదా ప్రతిపక్ష నాయకుడు ఉండేది'

English summary
pawan kalyan is honest man, i wont bare his critics: bandla ganesh counters prakash raj
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X