• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్‍‌కు కనిపించట్లేదా? రేపు ఏదైనా జరిగితే ఏపీ కుక్కలు చింపిన విస్తరి: చంద్రబాబు

By Srinivas
|

అమలాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకొని తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ధ్వజమెత్తారు. అమలాపురంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, వైసీపీ అధినేత జగన్, జనసేనానిలపై విరుచుకుపడ్డారు.

రేపు (2019) జరిగే ఎన్నికలు చారిత్రక అవసరమని చెప్పారు. రైతులకు రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. పవన్ యూటర్న్ తీసుకొని తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి పవన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడిందన్నారు.

బాబు ఇంటికింద తవ్వినా ఏదో ఒకటి బయటపడుతుంది, కూలదోస్తారా: పవన్, భార్య ప్రసవంపై ఎమోషనల్‌గా..

రేపు ఏమైనా జరిగితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. ప్రతి వారం కోర్టుకు వెళ్లే వ్యక్తి, 13 కేసుల్లో నిందితుడు అయిన జగన్ తనపై విమర్శలు చేస్తారా అన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో తాను ఎక్కడా తప్పు చేయలేదన్నారు. తాను ఇప్పటి వరకు చిన్న తప్పు చేయలేదని, చేయనని చెప్పారు. తనపై బురద జల్లే కార్యక్రమం చేపడితే ఆ బురద మీకే అంటుకుంటుందన్నారు. మీ గౌరవం నిలబడేలా పని చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan is not seeing development in Uttarandhra: Chandrababu

కేంద్రం మనకు అయిదోసారి బడ్జెట్‌లో కూడా అన్యాయం చేసిందన్నారు. ఎవరైనా కుట్రలు చేస్తే వదిలిపెట్టేది లేదన్నారు. నేను చెప్తేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఆమోదించడం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చి ఉంటే మనం ఇంకా అభివృద్ధి చెంది ఉండేవాళ్లమన్నారు.

విభజన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరి ఏపీలో పండుగ చేసుకునే పరిస్థితి లేదన్నారు. అందుకే ఆ రోజు నవ నిర్మాణ దీక్ష చేసి అందరం అంకిత భావంతో పని చేయాలని ముందుకు పోతున్నామన్నారు. చాలామంది దీక్షలు చేస్తారని, అయ్యప్ప దీక్ష, రంజాన్ దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష.. కానీ రాష్ట్రవ్యాప్తంగా మనం జరుపుకునే ఏకైక దీక్ష నవ నిర్మాణ దీక్ష అన్నారు.

ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పామని, రాష్ట్రానికి ఏదో చేస్తారని భావించి ఎన్డీయేలో చేరామని, ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. కానీ కేంద్రం నమ్మించి మోసం చేసిందన్నారు. నాలుగేళ్ల కిందట పెట్టుకున్న నవ నిర్మాణ దీక్ష అప్పటికి, ఇఫ్పటికీ ఉపయోగపడిందన్నారు. అందరం కలిసి ఏపీని నెంబర్ వన్‌గా చేద్దామన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Tuesday in Nava Nirmana Deeksha said that Jana Sena chief Pawan Kalyan is not seeing development in Uttarandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X