అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ పచ్చి అవకాశవాది, జనసేనను OLXలో పెట్టారు, చంద్రబాబు ఆశ్చర్యపోయారు:పేర్ని నాని

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని విమర్శించారు. జనసేన పార్టీకి సిద్ధాంతం లేదు అని, విమర్శించిన వారితోనే కలువడంలో అర్థం ఏంటి అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీని కూడా ఓఎల్ఎక్స్‌లో బేరం పెట్టొచ్చని.. పవన్ కల్యాణ్ నిరూపించారన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ద్వేషం అనే పవన్ కల్యాణ్ ఎందుకు పదే పదే ఆయన పేరు ప్రస్తావిస్తారని పేర్ని నాని నిలదీశారు.

అవకాశవాద రాజకీయాలు..

అవకాశవాద రాజకీయాలు..

అవకాశవాద రాజకీయాలకు పవన్ నాయుడు చిరునామా అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. బీజేపీతో కలుస్తామని.. ఢిల్లీలో పడిగాపులు కాచారు కదా అని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, ఇతర అవసరాలు చాలా ఉన్నాయి కదా అని అడిగారు. షరతులు పెట్టకుండా బేషరతుగా ఎందుకు కలిసి పనిచేస్తున్నారని ప్రశ్నించారు.

 కేసులు ఉన్నాయా ..?

కేసులు ఉన్నాయా ..?

జగన్ గారికి కేసులు ఉన్నందుకు ప్రధాని మోడీకి భయపడ్డారు. మరి మీరు ఎందుకు వణికిపోయారు. మాకు తెలియని కేసులు ఏమున్నాయి అని ప్రశ్నించారు. జగన్‌పై సోనియా, చంద్రబాబు కలిసి కేసులు పెట్టించారు.. ఈ విషయం అందరికీ తెలుసన్నారు.కన్నా లక్ష్మీనారాయణ గాక.. పవన్ కల్యాణ్ కూడా మాట్లాడటంలో సిగ్గనిపించలేదా అని విమర్శించారు.

2024లో జగనే

2024లో జగనే

2014లో చంద్రబాబు, మోడీని పవన్ కల్యాణ్ గెలిపించారు. 2019లో జగన్ గారిని గెలిపించారు. 2024లో కూడా జగన్ గారిని గెలిపిస్తారని మంత్రి పేర్ని నాని అన్నారు. అప్పుడు ఇదే మాట అంటారు గుర్తుంచుకోవాలని మీడియా ప్రతినిధులతో పేర్ని నాని అన్నారు.

చంద్రబాబు కూడా..

చంద్రబాబు కూడా..

చంద్రబాబు నాయుడికి రాజకీయ, ఆర్థిక అవసరాలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు ఆయన కుమారుడు లోకేష్ చేయని పనులు ఇతరులతో చేయించుకుంటారని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు కూడా ముక్కున వేలేసుకునేలా పవన్ కల్యాణ్ ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అవకాశవాద రాజకీయాలకు పవన్ కల్యాణ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారని విమర్శించారు.

English summary
janasena chief pawan kalyan is selfish minister perni nani said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X