• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కల్యాణ్‌ను తిడితే క్రిమినల్ కేసు.. జనసేన పార్టీ సంచలన హెచ్చరిక

|

దేశంలోని ఏ రాజకీయ పార్టీ తలపెట్టని పనికి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ముందుకొచ్చింది. తమ పార్టీ అధినేతపై, ముఖ్యనేతలపై విమర్శలు, తప్పుడుప్రచారాలు చస్తోన్నవాళ్లను కోర్టుకు ఈడ్చుతామని జనసేన లీగల్ సెల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పవన్ వ్యతిరేక ప్రచారాన్ని ఖండించింది. బుధవారం పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ ఇనవ సాంబశివ ప్రతాప్ పేరుతో ఈ మేకు సంచలన ప్రకటన వెలువడింది.

  Pawan Kalyan పై Sanchaita Gajapathi Raju ఆరోపణ | Mansas Trust వ్యవహారం పై..!!
  మాజీలకు స్ట్రాంగ్ డోస్..

  మాజీలకు స్ట్రాంగ్ డోస్..

  కుండబద్దలు కొట్టినట్లు అభిప్రాయాల్ని వెల్లడించే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవలే వివిధ నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీలో మాట్లాడుతూ.. ‘‘2వేల రూపాయలకు ఓట్లు అమ్ముకునే ప్రజలకు.. రూ.2వేల కోట్ల కుంభకోణం గురించి ప్రశ్నించే హక్కులేదు''అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి, బీజేపీతో పొత్తు తదితర అంశాలపై జనసేన మాజీ నేతలు పవన్ పై విమర్శలు గుప్పించారు. అలాంటివాళ్లందరికీ స్ట్రాంగ్ డోస్‌గా ఏమని వార్నింగ్ ఇచ్చారంటే..

  సారుపై గౌరవం ఉండొద్దా..

  సారుపై గౌరవం ఉండొద్దా..

  ‘‘గతంలో జనసేన పార్టీలో ఉండి.. ఆపై ఇతర పార్టీలకు అమ్ముడుపోయి.. ఇప్పటికీ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటూ.. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. జనసేన పార్టీని, విధానాలను, ముఖ్యనాయకులును, కార్యనిర్వాహకులను కించపరుస్తున్నారు. వీళ్ల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. పార్టీ సిద్ధాంతాలపై గౌరవం, చీఫ్ పవన్ కల్యాణ్ పట్ల కనీస అభిమానం లేనివాళ్లే ఈ తరహా వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు''అని జనసేన లీగల్ సెల్ ఆరోపించింది.

  క్రిమినల్ కేసులు..

  క్రిమినల్ కేసులు..

  గడిచిన రెండుమూడు రోజులుగా కొంతమంది వ్యక్తులు.. సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు పెడుతూ పవన్ కల్యాణ్, జనసేనను తీవ్రంగా విమర్శిస్తున్నారని, పార్టీ సిద్ధాంతాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన లీగల్ సెల్ కోఆర్డినేటర్ ప్రతాప్ పేర్కొన్నారు. ‘‘పవన్ పై, పార్టీపై తిట్లు కురిపిస్తూ, తప్పుడు ప్రచారానానికి పాల్పడుతోన్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అంశానికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టాం. ముందుగా లీగల్ నోలీసులు జారీచేసి, తదుపరి క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించాం''అని ప్రకటనలో తెలిపారు.

  ఇంతకీ ఎవరా మాజీలు?

  ఇంతకీ ఎవరా మాజీలు?


  ‘‘గతంలో పార్టీలో పనిచేసి వ్యక్తులు''అంటూ జనసేన పార్టీ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేనలో ఉన్నారో లేరో లెలియని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ పై తరచూ విరుకుపడే నటి శ్రీరెడ్డి, గతంలో పవన్ కు క్లోజ్ గా వ్యవహరించిన రాజా రవితేజ తదితరులు ఇటీవల కాలంలో పవన్ పై విమర్శలు చేశారు. అయితే మూడ్రోజులుగా లైవ్ వీడియోలు చేస్తున్న ఆ మాజీలు ఎవరేనేది తెలియాల్సిఉంది.

  English summary
  jana sena party condemns the anti pawan propaganda on social media. jana sena legal cell warns its former members not to criticize party chief pawan kalyan or any active members.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X