వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడకు పవన్ కళ్యాణ్: పోలీసుల ఆంక్షలు: జనసేనాని వార్నింగ్..!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కాకినాడ పర్యటన పైన టెన్షన్ నెలకొని ఉంది. తాజాగా కాకినాడలో వైసీపీ..జనసేన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్ ఈ రోజు కాకినాడ వస్తున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి జనసేన అధినేతను దూషిస్తూ చేసిన వ్యాఖ్యల పైన జనసేక కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించా రు. వారికి కౌంటర్ గా వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకోవటంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. ఈ రోజు కాకినాడకు చేరుకొని అక్కడ కార్యకర్తలకు భరోసా ఇవ్వనున్నారు. ఇదే సమయంలో పోలీసులు కాకినాడలో ముందస్తు చర్యలు చేపట్టారు.

కాకినాడకు జనసేనాని

కాకినాడకు జనసేనాని

కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పర్యటించనున్నారు. వైసీపీ దాడుల్లో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్‌ పరామర్శించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి జనసేన అధినేతను దూషిస్తూ.. అసభ్యంగా మాట్లాడారంటూ స్థానికంగా ఉన్న జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తల తో ఘర్షణ చోటు చేసుకుంది.

ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న పవన్

ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న పవన్

రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరి గింది. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న పవన్ స్పందించారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఉంటూ అనుచితంగా వ్యవహించినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇక, ఈ రోజు కార్యకర్తలను పరామర్శించి..అక్కడే పవన్ ప్రసంగించనున్నారు. పార్టీ కార్యకర్తల పైన దాడులు చేసిన వారి పైన చర్చలకు ఆయన డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల ఆంక్షలు..

పోలీసుల ఆంక్షలు..

పవన్‌ పర్యటన నేపథ్యంలో కాకినాడలో సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 విధించారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలకు పోలీసులు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పవన్‌ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు బయల్దేరారు. ఆదివారం పరిస్థితులు రిపీట్‌ అవుతాయోమోనని టెన్షన్‌ నెలకొంది. పవన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారు.

ద్వారంపూడిని అరెస్టు చేసే వరకు

ద్వారంపూడిని అరెస్టు చేసే వరకు

అయితే ద్వారంపూడిని అరెస్టు చేసే వరకు జనసేన శ్రేణులు ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. దీంతో..పవన్ కాకినాడ పర్య టన పైన ఉత్కంఠ నెలకొని ఉంది. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సోమవారం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న పవన్.. కాసేపట్లో విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కాకినాడ కు వచ్చి కార్యకర్తలతో సమావేవమవుతారు.

English summary
Janasena Chief pawan Kalyan Kakinada tour to console party volunteers who injured in YCP cadre attacks. After Delhi tour pawan politics steps creating curiosity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X