• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'రిపబ్లిక్' ఈవెంట్‌లో జగన్‌పై పవన్ వీరావేశం-తెగేదాకా లాగొద్దు-నా సినిమాలు ఆపి,చిత్రపరిశ్రమను వదిలేయండి...

|

జనసేన అధినేత,సినీ హీరో పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై,వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. 'ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు... ఇండియన్ రిపబ్లిక్... అని పేర్కొన్నారు. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో జనం బయటకు లాక్కొచ్చి కొడుతారు...' అని హెచ్చరించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురైతే రకరకాల కథనాలు వచ్చాయని... నిజానికి ఫోకస్ పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.ఇడుపులపాయ నేలమాళిగల్లో టన్నులకొద్ది డబ్బు ఉందని చెబుతారు... కానీ వాటిపై కథనాలు నడిపితే ఇళ్లల్లోకి వచ్చి కొడుతారు కాబట్టి వాటిపై మాట్లాడరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ వివేకానంద హత్యపై మాట్లాడండి...

వైఎస్ వివేకానంద హత్యపై మాట్లాడండి...

'తేజు ప్రమాదంపై కాదు మాట్లాడాల్సింది.... వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారో మాట్లాడండి... ఇంకా ఇంట్రెస్టింగ్ కథ ఒకటి ఉంది... కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచినప్పుడు.. దాని వెనుక భారీ కుట్ర ఉందన్నారు... ఆ కుట్ర ఏంటో అడగండి... తేజు యాక్సిడెంట్ గురించి కాదు... గిరిజనులకు పోడు భూముల సమస్య ఉంది... వాటిపై మాట్లాడండి.ఆరేళ్ల చిన్నారి హత్యాచారంపై మాట్లాడండి. ఇంకా స్పైసీగా ఉండాలంటే... వైసీపీ సానుభూతిపరులు వ్యభిచారాన్ని లీగలైజ్ చేయమని బయటకొచ్చారు.దానిపై కథనాలు నడపండి.'అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లపై మాట్లాడి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదో... దానిపై మాట్లాడండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు.... బోయ కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు... ఒక ఆడబిడ్డ బయటకు వెళ్తే క్షేమంగా ఎలా రావాలి.... ఈ అంశాలు మాట్లాడండి.

తెగేదాకా లాగొద్దు...

తెగేదాకా లాగొద్దు...

తేజు ఇంకా ఆస్పత్రిలో కళ్లు తెరవకుండా కోమాలో ఉన్నాడు. తేజు యాక్సిడెంట్ గురించి కాదు మాట్లాడాల్సింది... పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి.తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి... ఆంధ్రాలో లేవు.వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే... పవన్ కల్యాణ్ సినిమా ఆపేసినా,అతనొచ్చిన చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు ఆపేసినా... భయపడి మనవద్దకు వస్తారని అనుకుంటున్నారు.చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.అరేయ్ సన్నాసుల్లారా... దద్దమ్మల్లారా.. ఒక హీరో గానీ,హీరోయిన్ గానీ రూ.10 కోట్లు తీసుకుంటే... అందులో 45శాతం ట్యాక్స్ కడుతారు.అయినా అది ఎవడో దోచి ఇచ్చింది కాదు. వాళ్ల కష్టం మీద వచ్చింది.అరేయ్ బాబు మేము అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు సంపాదించలేదు.జనాలను ఎంటర్టైన్ చేసి సంపాదిస్తున్నాం.రౌడీయిజం,గూండాయిజం చేస్తే తలవంచుకుని వెళ్లిపోతాం.కానీ బతకనివ్వండి. అదే సమయంలో తెగేదాకా లాగొద్దు.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

మోహన్ బాబు స్కూల్‌ను జాతీయం చేయగలరా...

మోహన్ బాబు స్కూల్‌ను జాతీయం చేయగలరా...

'నిర్మాతలు నష్టపోతే డబ్బులు వదిలేసుకున్నవాడిని నేను.కిన్నెర మొఘులయ్య లాంటి వ్యక్తులను గుర్తించాం... అది మా సంస్కారం. మీరు ఒక్కసారి ఎన్నికల్లో గెలిచి 30 ఏళ్లు ఉండాలనుకున్నప్పుడు నిర్మాతలు కూడా థియేటర్లు తమ చేతిలో పెట్టుకోవాలనుకోరా. ఒకవేళ మీరు చేయగలిగితే వెనుకబడినవాళ్లకు,ఆర్థికంగా లేనివాళ్లకు థియేటర్లు ఇవ్వండి.మీకూ డబ్బులు వద్దు,మాకూ డబ్బులు వద్దు అంటున్నారు.సంపద సృష్టి జరగకపోతే డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి.సంపద సృష్టించకపోతే మొఘులయ్యకు రూ.2లక్షలు ఇవ్వగలనా.. జీవితంలో విసిగిపోయాను.వంగి వంగి ఒంగిపోయింది జీవితం.మీరేమో పవర్ స్టార్ అంటారు... వాళ్లేమో నా పేరు చెప్పి సావదొబ్బుతున్నారు.జగన్ రెడ్డి,దిల్ రాజు రెడ్డి కలిసి తేల్చుకోండి.దిల్ రాజు గారు మీరు వకీల్ సాబ్ సినిమా తీయకపోయి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. అయినా ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు చేస్తే ప్రభుత్వం నియంత్రించడమేంటి. సినీ ఇండస్ట్రీకి అప్లై చేసిన రూల్... రేప్పొద్దున మోహన్ బాబు విద్యానికేతన్ స్కూల్‌‌కు అప్లై చేయగలరా.. ఆ స్కూల్‌ను జాతీయం చేసి... ఫీజులు ఆన్‌లైన్‌లో తీసుకోగలరా... చిత్రపరిశ్రమ వైపు చూడకండి.కాలిపోతారు జాగ్రత్త.' అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

చిత్రపరిశ్రమను వదిలేయండి...

చిత్రపరిశ్రమను వదిలేయండి...

'మీరు రూ.1లక్ష కోట్లు సంపాదించొచ్చా మేము సంపాదించకూడదా.రాజ్యాంగ స్పూర్తిని గుండెల్లో నింపుకున్నవాడిని. సినీ ఇండస్ట్రీకి కులాలు,మతాలు ఉండవు. దురదృష్టవశాత్తు కులాలకే పరిమితమైతే అసలైన రిపబ్లిక్ స్పూర్తి పోతుంది. పవన్ కల్యాణ్ మీద కోపంతో సినిమాలు ఆపేసి లక్ష మంది పొట్ట కడుతున్నారు.మీకూ నాకు ఏమైనా ఉంటే నా సినిమాలు ఆపేయండి.మావాళ్లను వదిలేయండి.ఉపయోగపడని సోదర భావన దేనికి.మీ అందరికీ ఇబ్బంది ఉండొచ్చేమో నేనిలా మాట్లాడటం.వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయకుడు,చీఫ్ జస్టిస్‌ పైనే దాడులు చేశారు. అయినా వారి 1.లక్ష కోట్ల ముందు మహా అయితే రూ.2వేల కోట్లు ఉండే చిత్రపరిశ్రమ పెద్ద లెక్కనా.ఆ సన్నాసికి చెప్పండి.పవన్ సినిమాలు ఆపి చిత్రపరిశ్రమను వదిలేయండని.' అంటూ ప్రభుత్వంపై,పరోక్షంగా మంత్రి పేర్ని నానిపై పవన్ ఫైర్ అయ్యారు.

English summary
Janasena leader and movie hero Pawan Kalyan was furious with Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy and YSRCP leaders. "This is not a YSRCP republic ... it is an Indian republic ..." he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X