వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర విధానానికి విరుద్ధంగా జగన్ సర్కారు: ‘కేజీ-పీజీ ఫ్రీ’ అంటూ పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. బుధవారం విజయవాడలో పవన్ కళ్యాణ్ ఆయన నివాసంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు కలిశారు.

నేనేమీ సరదా కోసం పెళ్లిళ్లు చేసుకోలేదు: పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలునేనేమీ సరదా కోసం పెళ్లిళ్లు చేసుకోలేదు: పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు

అదే మా పార్టీ విధానం..

అదే మా పార్టీ విధానం..

ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో మాతృ భాషను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలోనూ చదువుకునే వెసులుబాటు ఇవ్వటమే జనసేన పార్టీ విధానం అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలుగు మాధ్యమం పూర్తిగా తొలగించడం పద్ధతి కాదు... ఆ మాధ్యమాన్ని కొనసాగిస్తూ, ఆ మాధ్యమంలో చదువుకొనే వారికి ప్రోత్సాహం ఇచ్చేలా తదుపరి ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు.

కేజీ టు పీజీ వరకు ఫ్రీ..

కేజీ టు పీజీ వరకు ఫ్రీ..

‘ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు మాతృ భాషలో బోధన ఎలా అనే అంశంపై పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జనసేన ప్రభుత్వం వచ్చాక కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు మాధ్యమంలో చదివే వారికి రుసుములు ప్రభుత్వమే చెల్లించే విధానం తెస్తాం' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కేంద్ర విధానానికి వ్యతిరేకంగా ఏపీ సర్కారు..

కేంద్ర విధానానికి వ్యతిరేకంగా ఏపీ సర్కారు..

‘కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ 2019 జాతీయ విద్యా విధానానికి సంబంధించిన ముసాయిదాను డాక్టర్ రమేష్ బాబు మా దృష్టికి తీసుకువచ్చారు. ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృ భాషలోనే బోధన చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇంగ్లీష్ లో బోధన చేయాలనే విధానాన్ని తీసుకువచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఏపీ సర్కారుది తొందరపాటు నిర్ణయం..

ఏపీ సర్కారుది తొందరపాటు నిర్ణయం..

‘రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తెలుగు భాష మీద మక్కువతో రమేష్ బాబు రెండు దశాబ్దాలుగా అమ్మనుడి అనే పత్రికను నడుపుతున్నారు. తెలుగు మాధ్యమ బోధనలో ఎలాంటి మార్పులు చేస్తే మంచి మార్పులు వస్తాయి అనే అంశంపై కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. పాఠశాలల్లో ఓ ఆహ్లాదకరమైన వాతారణంలో తెలుగు బోధన జరిపేలా చర్యలు తీసుకుంటాం' అని పవన్ కళ్యాన్ చెప్పారు.

పవన్ కళ్యాణ్‌కి ఆ సత్తా ఉంది..

పవన్ కళ్యాణ్‌కి ఆ సత్తా ఉంది..


తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు మాట్లాడుతూ.. తెలుగు జాతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా పవన్ కళ్యాణ్‌కి ఉందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య తరఫున వారికి కావల్సిన మద్దతు ఇస్తామని తెలిపారు. డాక్టర్ సామల రమేష్ బాబుతోపాటు విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ వి. సింగారావు కూడా పవన్ కళ్యాణ్‌ని కలసిన వారిలో ఉన్నారు.

English summary
Janasena Party president Pawan Kalyan lashed out at AP CM YS Jagan for english medium issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X