వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనంలోకి జనసేనాని: బస్సు యాత్ర, అభ్యర్ధుల ఎంపిక, పవన్ వ్యూహమిదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలో బస్సు యాత్ర చేయనున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియపై కూడ పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు.

2019 ఎన్నికలకు జనసేన సిద్దమౌతోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికల వ్యూహకర్త దేవ్ ను కూడ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు.

ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా వేడి నెలకొంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మరింత హీట్‌ను పెంచే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మే 15 నుండి పవన్ బస్సు యాత్ర

మే 15 నుండి పవన్ బస్సు యాత్ర

మే 15 నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలో బస్సు యాత్రను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి జనసేన విధి విధానాలను వివరించడంతో పాటు ఇతర పార్టీల తీరును ఎండగట్టనున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడ పోటీ చేయనున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్రకు పవన్ సన్నద్దమయ్యారు.బస్సుయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకొనే అవకాశం ఉంది.

నాలుగు జిల్లాల్లో భారీ సభలు

నాలుగు జిల్లాల్లో భారీ సభలు

ఏపీ రాష్ట్రంలో బస్సు యాత్రలను పురస్కరించుకొని నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలను నిర్వహించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే ఆ నాలుగు బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ బస్సు యాత్ర ద్వారానే తొలి దశ ప్రచార యాత్రను పూర్తి చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

అభ్యర్ధుల ఎంపికపై పవన్ కసరత్తు

అభ్యర్ధుల ఎంపికపై పవన్ కసరత్తు


2019 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై కూడ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆయా జిల్లాల పర్యటన సమయంలో ఈ విషయమై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ప్రతి జిల్లా నుండి సుమారు 100 మంది నేతలను ఎంపిక చేయనున్నారు. వీరి నుండి పోటీకి అర్హులైన వారిని ఎంపిక చేసే అవకాశం లేకపోలేదంటున్నారు.

ఎన్ఆర్‌ఐలతో సమావేశాలు

ఎన్ఆర్‌ఐలతో సమావేశాలు

విదేశీ పర్యటనల సమయంలో ఎన్ఆర్ఐలతో కూడ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. జనసేనకు మద్దతివ్వాలని కోరే అవకాశాలున్నాయి. మరో వైపు ప్రతి జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలం ఎంపిక చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.

English summary
Janasena chief Pawan Kalyan will start Bus yatra in Ap state from May 15 2018. Pawan kalyan has announced to contest 175 assembly segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X