వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ తలలు నరుకుతామన్న జనసేన కార్యకర్త...! మద్దతు పలికిన జనసేనాని

|
Google Oneindia TeluguNews

రాయలసీమలో పర్యటిస్టున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజు ఏదో ఒక సంచలనంతో ప్రజల్లో నానుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ నేడు మరో సంచలనానికి తెరదీశారు. తన సమక్షంలో ఓ కార్యకర్త చట్టవిరుద్దంగా చేసిన వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు. చట్టాలు అందరికి ఒకేలా ఉండాలని ఆయన సూచించారు.

 రాపాడులో బహిరంగ సభలో కార్యకర్త సంచలనం

రాపాడులో బహిరంగ సభలో కార్యకర్త సంచలనం

రాపాడులో నిర్వహించిన జగసేన సభలో ఓ కార్యకర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్టేజీపై ఉండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. వైసీపీ నేతలు తమను వేధిస్తున్నారని అంటూ పవన్‌కు కార్యకర్త ఫిర్యాదు చేశారు. అయితే తమ నేత పవన్ కల్యాణ్ తామని శాంతియుతంగా ఉండాలని సూచించారని , దాంతో తాము ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నామని చెప్పారు. ఆయన ఒక్కసారి ఆదేశాలు జారీ చేస్తే... ప్రత్యర్థి వైసీపీ వారి తలలు నరికి తీసుకువస్తామని బహిరంగంగా ప్రకటించారు.

నాపై కూడ కేసులు పెట్టండి

నాపై కూడ కేసులు పెట్టండి

దీంతో పవన్ కల్యాణ్ స్పందించారు. ఒకవేళ కార్యకర్తపై కేసులు పెడితే తనపై కూడ కేసులు కూడ పెట్టాలని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. దీంతో పాటు చట్టవిరుద్దంగా మాట్లాడిన సీఎం జగన్‌పై కూడ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం అందరికి సమానంగా పని చేయాలని, బలవంతుడికి చట్టాలు చుట్టంగా..బలహీనుడికి మరోరకంగా ఉండకూడదని ఆయన వివరించారు. ఈనేపథ్యంలోనే పాతకాలపు రోజుల పోయాయని ఇప్పుడు రాయల సీమ ఓ సింహాల గడ్డ అని ఆయన కొనియాడారు.

నిరోధించాల్సిన పవన్ కల్యాణ్ కార్యకర్తకు మద్దతు

నిరోధించాల్సిన పవన్ కల్యాణ్ కార్యకర్తకు మద్దతు

కాగా బహిరంగంగా చట్టవిరుద్దంగా ఓ పార్టీ కార్యకర్త మాట్లాడిన దాన్ని నిరోధించాల్సి పవన్ కల్యాణ్, ఆ వ్యాఖ్యలు చేసిన కార్యకర్తను సమర్ధించారు. ఈ నేపథ్యంలోనే సదరు కార్యకర్త చేసిన వ్యాఖ్యలను భూతద్దంలో చూపిస్తున్నారని.. ఆవేదనతో ఆ కార్యకర్త ఆవేశంగా మాట్లాడరని అన్నారు. ఒకవేళ కార్యకర్తపై కేసు నమోదు చేస్తే... తనపై కూడ కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉరితీయాలని వ్యాఖ్యానించారని అన్నారు. ఈ నేపథ్యంనే ఆయనపై కూడ కేసు నమోదు చేయాలని అన్నారు. చట్టాలు అందరికి ఒకేలా పని చేయాలని సూచించడం సంచలనంగా మారాయి.

English summary
once again janasena chief pawan kalyan made sensational comments on government. he supported to party activist which made illegal comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X