హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెఎఫ్‌సి మీటింగ్: మాతో పనిచేసేందుకు ఎందరో: పవన్, ట్విస్టిచ్చిన వైసీపీ నేత తోట చంద్రశేఖర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

JFC : Pawan Kalyan says Many Are Showing Interest To Work

హైదరాబాద్: జెఎప్‌సితో కలిసి పనిచేసేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే రానున్న రోజుల్లో ఏ రకంగా పోరాటాన్ని చేయాలనే అంశంపై రెండు రోజుల సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవనే విషయమై రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. అయితే ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి నిధుల విషయమై కేంద్రం, రాష్ట్రం చెబుతున్న లెక్కల్లో వాస్తవాలను నిర్ధారించేందుకు జెఎఫ్‌సిని ఏర్పాటు చేశారు.

జెఎఫ్‌సి మొదటి సమావేశంలో హైద్రాబాద్‌లో ఫిబ్రవరి 16వ, తేదిన ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీలోని అన్ని రాజకీయపార్టీల నేతలతో పాటు పలువురు మేథావులు, ప్రముఖులను ఆహ్వనించారు.

జెఎఫ్‌సితో కలిసి పనిచేసేందుకు చాలా మంది సిద్దం

జెఎఫ్‌సితో కలిసి పనిచేసేందుకు చాలా మంది సిద్దం

జెఎఫ్‌సి కలిసి పనిచేసేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 16వ, తేదిన హైద్రాబాద్‌లో జెఎఫ్‌సి సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో వాస్తవాలను తేల్చే ఉద్దేశ్యంతో జెఎఫ్‌సి పనిచేస్తోంది. అయితే జెఎఫ్‌సితో పనిచేసేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నా, వారిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

జెఎఫ్‌సి మీటింగ్: మాపై ఎక్కువ ఆశలొద్దు, ఆకాశానికెత్తి పడేయొద్దు: జెపి ఆసక్తికరంజెఎఫ్‌సి మీటింగ్: మాపై ఎక్కువ ఆశలొద్దు, ఆకాశానికెత్తి పడేయొద్దు: జెపి ఆసక్తికరం

వైసీపీ నేత తోట చంద్రశేఖర్ హజరు

వైసీపీ నేత తోట చంద్రశేఖర్ హజరు

జెఎఫ్‌సి సమావేశానికి వైసీపీ నేత తోట చంద్రశేఖర్ హజరయ్యారు. ఈ సమావేశానికి వైసీపీతో పాటు, టిడిపిలకు కూడ ఆహ్వనాన్ని పంపామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు,. అయితే ఈ సమావేశానికి టిడిపి, వైసీపీ ప్రతినిధులెవరూ కూడ హజరుకాలేదు. కానీ, వైసీపీ నేత తోట చంద్రశేఖర్ ఈ సమావేశానికి హజరయ్యారు. ఈ సమావేశానికి తాను వ్యక్తిగతంగానే హజరయ్యాయని తోట చంద్రశేఖర్ ప్రకటించారు. పార్టీ ప్రతినిధిగా ఈ సమావేశానికి హజరు కాలేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

జగన్‌ ఎఫెక్ట్‌: గందరగోళంలో టిడిపి, అందుకే 'ఆది'ని నిలువరించారా?జగన్‌ ఎఫెక్ట్‌: గందరగోళంలో టిడిపి, అందుకే 'ఆది'ని నిలువరించారా?

ఆ పార్టీలకు ఆహ్వనం పంపాను.

ఆ పార్టీలకు ఆహ్వనం పంపాను.

జెఎఫ్‌సి సమావేశం విషయమై టిడిపి, వైసీపీలకు కూడ ఆహ్వనం పంపినట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ, ఆ పార్టీల ప్రతినిధులు ఎందుకు రాలేదో తనకు తెలియదని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఏపీకి న్యాయం కోసం ఆ రెండు పార్టీలు వారి పంథాలో వారు పోరాటాన్ని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.అయితే ఏపీ రాష్ట్రానికి న్యాయం జరగాలనేది తమ ముఖ్య ఉద్దేశ్యమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఈ దిశగానే జెఎప్‌సి ప్రయత్నం చేస్తోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

 ఏం చేస్తారు

ఏం చేస్తారు

ఏపీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఏం చేయాలనే దానిపై రెండు రోజుల పాటు విస్తృతంగా చర్చించనున్నారు. ఇప్పటివరకు వచ్చిన నిధులు, రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించనున్నారు. వీటి ఆధారంగా న్యాయం కోసం ఇంకా ఏం చేయాలనే దానిపై విస్తృతంగా చర్చించనున్నారు. రెండు రోజుల సమావేశం ముగింపు సందర్భంగా ఈ విషయమై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

English summary
The Joint Fact-Finding Committee appointed by Jana Sena President Pawan Kalyan on Friday sat for its first meeting at Hotel Daspalla in Hyderabad. The meeting witnessed leaders of all parties along with some academicians, experts, and others participating in it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X