వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం?: 'ఆమరణ దీక్ష' దిశగా?.. మహేష్ కత్తి మద్దతు..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ అంటే లెక్క లేనట్టుగా వ్యవహరిస్తున్న కేంద్రం మెడలు వంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని టీడీపీ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఒక్కటై పోరాడాల్సిన తరుణంలో.. వైసీపీ, టీడీపీ ఎప్పటిలాగే వేర్వేరుగా పార్లమెంటు పోరాటం సాగిస్తున్నాయి.

Recommended Video

Pawan Kalyan Mulls JAC To Protect Andhra

కనీసం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనైనా ఈ రెండు పార్టీలు కలిసి పోరాడవచ్చు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయా పార్టీలకు ఉన్న రాజకీయ లెక్కలు దానికి అడ్డుపడుతున్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రశ్నించడంలో విఫలం?:

ప్రశ్నించడంలో విఫలం?:

2014ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఆయా పార్టీల పనితీరును ప్రశ్నించడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. దగ్గరుండి వాళ్లను గెలిపించిన జనసేనాని.. ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం ప్రభుత్వాలను ప్రశ్నించలేదన్న వాదన బలంగా వినిపిస్తూ వచ్చింది.

అలా చేస్తే.. జనసేనకు ప్లస్:

అలా చేస్తే.. జనసేనకు ప్లస్:

ప్రభుత్వాలను ప్రశ్నించలేదన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు పవన్ కల్యాణ్ ముందట ఇప్పుడో మహత్తర అవకాశం వచ్చి పడిందనే చెప్పాలి. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీపై అలసత్వ వైఖరి, విభజన హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై పవన్ ప్రత్యక్ష పోరాటానికి దిగితే రాజకీయంగా ఆయనకు ప్లస్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీక్షతో మెడలు వంచుతారా?:


పవన్ కల్యాణ్ గనుక కేంద్రం మెడలు వంచేందుకు ఢిల్లీలో దీక్ష చేపడితే జాతీయ స్థాయిలో ఆయన హైలైట్ అయ్యే ఛాన్స్ ఉందని, పవన్ కు రాజకీయంగానూ.. ఏపీకి రాష్ట్ర ప్రయోజనాల పరంగానూ మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీలో దీక్షపై ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్ కల్యాణ్‌కు కత్తి మద్దతు:

పవన్ కల్యాణ్‌కు కత్తి మద్దతు:

అటు పవన్ కల్యాణ్ నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రానే లేదు.. అప్పుడే మహేష్ కత్తి నుంచి ఆయనకు మద్దతుగా ప్రకటన రావడం గమనార్హం. 'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ఈ నెల 21 నుంచీ న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కు నా మద్దత్తు తెలుపుతున్నాను.' అంటూ కత్తి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఏం జరగబోతుంది:

ఏం జరగబోతుంది:

పవన్ గనుక ప్రత్యక్ష పోరాటానికి దిగితే రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి ప్రజా పోరాటల విషయంలో ఇప్పటికే చాలా వెనుకబడ్డ జనసేనకు ఇది చాలా ప్రయోజనం చేకూర్చుతుంది. అయితే పవన్ నిజంగా దీక్ష చేస్తారా?.. లేరా?.. అన్న దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ కత్తి మహేష్ మాత్రం అప్పుడే తన మద్దతు ప్రకటించేయడం గమనార్హం.

English summary
Janasena President Pawan Kalyan is may lead hunger strike in Delhi for Anhdrapradesh special status. The speculations are widely spreading in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X