వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ కొర్రీ: పవన్ జనసేనకు ఈసి గుర్తింపు కష్టమే

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్: జనసేన పేరుతో రాజకీయ పార్టీ నమోదుకు తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరు ఎన్నికల కమీషన్ (ఈసి)కి దరఖాస్తు చేసుకోవడంతో అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు దక్కడం కష్టమేనని అర్థమవుతోంది. పవన్ జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం క్రింద నమోదు చేసేందుకు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆరునెలల సమయం పడుతుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ బ్రహ్మ తెలిపారు. ఈ నెల 10న పవన్ తన పార్టీ నమోదుకోసం దరఖాస్తు దాఖలు చేశారని శుక్రవారం రాత్రి ఆయన ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో అన్నారు.

పవన్ కళ్యాణ్ దరఖాస్తు నిబంధనల ప్రకారం ఉన్నదో లేదో తెలిపేందుకే కనీసం రెండు వారాలు పడుతుందని, ఏమైనా లోపాలుంటే మళ్లీ ఆ పార్టీ ప్రతినిధులను పిలిచి సరిచేయిస్తామని కమిషన్ వర్గాలు అన్నాయి. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పేరిట మరొకరు ఇప్పటికే దరఖాస్తు చేసి ఉంటే ఆయన పేరు మార్చుకోవాల్సి ఉంటుందని, లేదా ఆయన ఆ పార్టీని తీసుకోవాల్సి ఉంటుందని కూడా కమిషన్ వర్గాలు చెప్పాయి.

Pawan Kalyan may not get EC approval for Jana Sena

సామాజిక తెలంగాణ సాధన కోసం, తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో జనసేన పార్టీ కోసం ఆరునెలల క్రితమే ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు బి.బాల్‌రాజ్ ముదిరాజ్ చెబుతున్నారు. దీంతో జనసేన పార్టీ పేరు పవన్ కళ్యాణ్‌కు దక్కడం కష్టమేనని అనిపిస్తోంది. ఇప్పుడు అదే పేరిట పవన్ కల్యాణ్ పార్టీ ఎలా పెడతారని బాలరాజ్ ప్రశ్నించారు.

పవన్ కంటే ముందుగానే మేం దరఖాస్తు చేసుకున్నామని, దరఖాస్తు చేసుకున్న తర్వాత 4 నెలల తర్వాత రిజిస్ట్రేషన్‌పై ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ తర్వాతే జెండా, అజెండా వంటివి ప్రకటించాలని, ఈసీ రిజిస్ట్రేషన్ కన్నా ముందుగానే పవన్ పార్టీ అజెండాను బహిరంగంగా ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమని బాలరాజు అన్నారు.

English summary

 Power star Pawan Kalyan may face trouble Election Commission approval for Jana Sena political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X