వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ పవన్ కళ్యాణ్: హార్వార్డ్ నిపుణుల రాక, చంద్రబాబుతో భేటీ

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 31వ తేదీన హార్వార్డ్ విశ్వవిద్యాలయం డాక్టర్లను కలవనున్నారు. ఉద్ధానం కిడ్నీ సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 31వ తేదీన హార్వార్డ్ విశ్వవిద్యాలయం డాక్టర్లను కలవనున్నారు. ఉద్ధానం కిడ్నీ సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు..

ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు..

ఈ మేరకు ఆయన ఉద్ధానంలో పర్యటించారు. ఆయన పర్యటన అనంతరం ప్రభుత్వంలోను కదలిక వచ్చింది. ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు పవన్ సిద్ధమన్నారు.

కిడ్నీ సమస్య ఎందుకు వచ్చింది...?

కిడ్నీ సమస్య ఎందుకు వచ్చింది...?

ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య ఎందుకు వచ్చిందనే అంశంపై పరిశోధించేందుకు హార్వార్డ్ విశ్వవిద్యాలయ డాక్టర్లు రానున్నారు. ఈ నెల 31వ తేదీన వారితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.

Recommended Video

Pawan Kalyan Seeks Chandrababu Naidu Appointment
హార్వార్డ్ నిపుణులు

హార్వార్డ్ నిపుణులు

వారితో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా ఆయన కలుస్తారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలు, పరిష్కారాలపై అధ్యయనం చేసేందుకు హార్వార్డ్ నిపుణుల బృందం వస్తోంది.

పవన్ కళ్యాణ్ కోరిక మేరకు..

పవన్ కళ్యాణ్ కోరిక మేరకు..

ఈ ఏడాది ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ అమెరికాలో పర్యటించారు. హార్వార్డ్‌లో ప్రసంగిస్తూ.. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య గురించి ప్రస్తావించారు. పవన్ కోరిక మేరకు ఏపీకి వచ్చి సమస్య తెలుసుకోవాలని హార్వార్డ్ నిపుణులు నిర్ణయించారు. వారు తొలుత చంద్రబాబుతో సమావేశమై.. ఆ తర్వాత ఉద్దానం వెళ్తారని తెలుస్తోంది.

English summary
Jana Sena party chief Pawan Kalyan to meet Harvard University Researchers on 31 July. He also will meet Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X