దద్దమ్మల్లా మాట్లాడితే ఎలా! మోసం చేయొద్దని పవన్ హితవు

అనంతపురం : గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ వాళ్లలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతలో నెలకొన్న కరువు పట్ల అక్కడి విద్యార్థులు అవగాహన పెంచుకునేలా పవన్ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తన సొంత అనుభవాలను.. పుస్తకాలు చదువి నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు వివరిస్తూ.. భవిష్యత్తులో అనంతపురంలో ఇలాంటి పరిస్థితులు లేకుండా చేయడానికి యువకులు, విద్యార్థులు ముందు తమ దృష్టి కోణం మార్చుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. తరిమెల నాగిరెడ్డి గారి తాకట్టులో భారత దేశం నుంచి కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ.. పలు సూచనలు చేశారు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడి.. నచ్చిన అంకెలను చెబుతూ.. రాజకీయ నాయకులంతా దద్దమ్మల్లా ప్రవర్తించవద్దని హితవు పలికారు.

Pawan kalyan meet with gate engineering students
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+