అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా వాళ్లమీద చెయ్యేస్తే చీరేస్తా.. గొడవలకు రెడీగా ఉన్నా: వైసీపీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

అయినదానికి, కానిదానికి జనసేన పార్టీ కార్యకర్తల్ని, అభిమానుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వాళ్లు చేసిన పనినే జనసేన వాళ్లూ చేస్తే.. పోలీసులు పక్షపాతంతో ఒక పార్టీ వాళ్లనే టార్గెట్ చేయడం సరికాదన్నారు.

కేసులు కొట్టేసేదాకా..

కేసులు కొట్టేసేదాకా..

గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో కొన్ని నెలల కిందట జరిగిన గొడవల్లో అరెస్టయిన జనసేన కార్యకర్తలు జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయా కుటుంబాలను పవన్ పరామర్శించారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కేసులు పూర్తిగా కొట్టుడుపోయేదాకా తాను అండగా ఉంటానని, పార్టీ లీగల్ టీమ్ సంబంధిత వ్యవహారాలను చూసుకుంటున్నదని కార్యకర్తలకు పవన్ భరోసా ఇచ్చారు.

ఆలోచించి దిగండి..

ఆలోచించి దిగండి..

‘‘వైసీపీ వాళ్లకు ఒక్కటే చెప్పదల్చుకున్నా.. 150 సీట్లున్నాయికదాని మీరు అధికారమదాన్ని ప్రదర్శిస్తే నేను చూస్తూ ఊరుకోలేను. రోడ్ల మీదికొచ్చిమరీ కొట్లాడుతా. మా వాళ్లమీద ఎవరైనా చెయ్యేస్తే సీరియస్ గా తీసుకుంటా. జనసేన కార్యకర్తలజోలికి వచ్చేముందు.. జరగబోయే పరిణామాలను ఆలోచించుకుని దిగండి.. గొడవలకు నేను రెడీ..''అంటూ పవన్.. వైసీపీకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.

నేను బాధ్యత గల వ్యక్తిని..

నేను బాధ్యత గల వ్యక్తిని..


గొడవలు పెట్టుకోడానికి రెడీగా ఉన్నప్పటికీ.. బాధ్యతగల పార్టీ అధినేతగా, సమాజ శ్రేయస్సుకోరే వ్యక్తిగా ఆ పని చేయబోనని పవన్ స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిందికదాని సంబరపడకుండా, సాధ్యమైనంత ప్రశాంతంగా, సామరస్యంగా ఉండాలని ధర్మవరం కార్యకర్తలకు సూచించారు. వీలు చేసుకుని ధర్మవరం వచ్చి, ఒక పూట అక్కడే గడుపుతానని పవన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ ఇన్ చార్జిలతో ఆయన భేటీ అయ్యారు.

English summary
JanaSena Party chief Pawan Kalyan meets Dharmavaram Villages On friday at Part central office. He accused police for filing false cases on party workers and also warns YCP And CM Jagan Not To do tha again
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X