వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ సభ: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగంలో పొరపాటు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ గ్రాండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఒక సందర్భంలో పొరపాటు పడ్డారు. 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అంటూ దేశభక్తి గీతాన్ని ప్రస్తావించిన సందర్భంలో ఈ పొరపాటు జరిగింది.

పవన్‌పై విమర్శలు చేయొద్దు: పార్టీ నేతలకు చంద్రబాబు, కాకినాడ సభపై ఇలా

వాస్తవానికి ఈ దేశభక్తి గీతాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. అయితే పవన్ తన ప్రసంగంలో ఈ గీతాన్ని రాసింది గురజాడ అప్పారావు అంటూ చెప్పి పొరపాటుపడ్డారు. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం మొండి చేయి చూపడం, సీఎం చంద్రబాబు కూడా చేతులెత్తేసిన నేపథ్యంలో హోదా సాధన కోసం భవిష్యత్‌లో తాను ఏం చేయబోతున్నాడో అన్న విషయాల గురించి మాట్లాడతాడని భావించిన వారందరికీ పవన్ షాక్ ఇచ్చారు.

pawan kalyan

తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీని గురించి కానీ, సీఎం చంద్రబాబు గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అయితే పవన్ ప్రసంగం మాత్రం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని మాట్లాడినట్టుగా అనిపించింది. గౌరవం ఉందంటూనే టీడీపీ, బీజేపీ నేతలనుద్దేశించి భలే మాట్లాడారు.

ఇక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై గౌరవం ఉందంటూనే తూర్పారబట్టారు. పెద్దవారైన వెంకయ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనను క్షమించాలని చెప్పిన పవన్.. సీమాంధ్రులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మూడు నాలుగు సంవత్సరాలుగా హోదా ఇస్తామంటూ, తిపికబురు వస్తోంది అంటూ పాచి కంపు కొట్టే రెండు లడ్డూలిచ్చారని పవన్ అన్నారు.

చట్టసభలో చేసిన చట్టాల కంటే మీ హామీలే ఎక్కువా అని బీజేపీ నేతలను ప్రశ్నంచారు. దీనిని పైస్థాయి వరకు తీసుకెళ్తానన్నారు. ఎవరైనా ఇక్కడి వస్తే ఈ పాచీ లడ్డూలు వద్దని చెప్పండన్నారు. ఏపీకి హోదాపై పార్లమెంట్‌లో నాటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖలో కేబుల్ వైర్లు కట్: పవన్ కాకినాడ స్పీచ్ చూడకుండా చేశారు

ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను బీజేపీ ఎంపీలు, నేతలు పీక పిసికి చంపేశారని అన్నారు. రేపు వారు జనాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు వారికి లడ్డులు చూపిస్తే మొఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు ఏపీలో బీజేపీని చంపేశారని, ఏపీ బీజేపీ నేతలు వేరే పార్టీ చూసుకోవాలని వ్యాఖ్యానించారు.

English summary
Power Star Pawan Kalyan, the founder of the Jana Sena Party, is addressing a massive public meeting in Kakinda city in Andhra Pradesh on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X