వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు అంతర్జాతీయ గుర్తింపు: ఐఈబీఎఫ్ అవార్డుకు ఎంపిక

జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపే వార్త ఇది. ఎందుకంటే.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపే వార్త ఇది. ఎందుకంటే.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ (ఐఈబీఎఫ్‌) ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు పవన్ ఎంపికయ్యారు.

విశేషమే..

విశేషమే..

ఈ ఏడాది నవంబర్‌ 17న హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సమావేశంలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నారు. ఇటీవలే అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీ పవన్‌ కళ్యాణ్‌ను గౌరవించగా.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ఎక్స్‌లెన్స్‌ అవార్డు వరించడం విశేషం.

ఈసారి పవన్‌ సేవలకు గుర్తింపు..

ఈసారి పవన్‌ సేవలకు గుర్తింపు..

వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏటా గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ సందర్భంగా ఈ అవార్డుతో ఐఈబీఎఫ్‌ గౌరవిస్తోంది. ఈ సారి పవన్‌ కళ్యాణ్‌ను అవార్డుతో సత్కరించాలని నిర్ణయించింది.

ఆహ్వానం అందించారు..

ఆహ్వానం అందించారు..

ఓ వైపు నటుడిగా, మరో వైపు రాజకీయ నాయకుడిగా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న పవన్‌కు ఈ ఏడాది ఎక్స్‌లెన్స్‌ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐఈబీఎఫ్‌ ఇండియా విభాగం అధిపతి సునీల్‌ గుప్తా, సమన్వయకర్త చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఈ మేరకు పవన్‌ను కలిసి ఆహ్వానాన్ని అందించారు.

ప్రశంసలు..

ప్రశంసలు..

ఈ సందర్భంగా వారు పవన్ చేసిన సేవలను గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాదిమంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్‌ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, కృషి ఎన్నో హృదయాలను కదిలించినట్లు వారు ప్రశంసించారు.

English summary
The Indo-European Business Forum has conferred the IEBF Excellence Award-2017 upon Jana Sena Chief, Pawan Kalyan in recognition of praiseworthy work for Uddanam Nephropathy and being brand ambassador for Textiles and Organ Donation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X