వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2019: 840 మంది ఇంఛార్జీలు, ప్రముఖులకు జనసేన తీర్థం, పవన్ ప్లాన్ ఇదే!

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఏపీ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడ పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan recruiting 840 members as incharges

అమరావతి: జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఏపీ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడ పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు పవన్‌కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే ఎన్నికల సమయం నాటికి రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీకి పవన్ కళ్యాణ్ అస్త్రాలను సిద్దం చేసుకొంటున్నారు. అయితే పోటీ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులను తయారు చేసుకొనేందుకు కసరత్తు చేస్తున్నారు.

పవన్ దారెటు?: లెఫ్ట్‌తో జట్టు కట్టేనా, జనసేన ప్లాన్ ఇదే!పవన్ దారెటు?: లెఫ్ట్‌తో జట్టు కట్టేనా, జనసేన ప్లాన్ ఇదే!

2014 ఎన్నికల సమయంలోనే పవన్‌కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో జనసేన మాత్రం పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి పవన్‌కళ్యాణ్ మద్దతును ప్రకటించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు మారాయి. దరిమిలా రెండు రాష్ట్రాల్లో పోటీకి పవన్‌కళ్యాణ్ సిద్దమయ్యారు.

42 పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇంఛార్జీల నియామకం కోసం పవన్ ఇలా..

42 పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇంఛార్జీల నియామకం కోసం పవన్ ఇలా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించే పనిలో పార్టీ నాయకులు హరిప్రసాద్, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ బిజీ‌ బిజీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో‌ ఉన్న 42 పార్లమెంట్ నియోజక వర్గాల్లోని 22 నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించారు.ఆంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ పదిహేడు నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించారు. తెలంగాణలో వరంగల్ నల్లగొండ భువనగిరి కరీంనగర్ ఖమ్మం పార్లమెంటరీ నియోజక‌వర్గాలకు ఇంఛార్జులను నియమించారు.

ఒక్కో పార్లమెంట్‌కు 20 మంది ఇంఛార్జీలు

ఒక్కో పార్లమెంట్‌కు 20 మంది ఇంఛార్జీలు

ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఇరవై మంది చొప్పున ఇంఛార్జులుగా నియమిస్తున్నారు.మెత్తం 840 మందిని పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జులకు ‌నియమించబోతున్నారు. డిసెంబర్ 7వతేదీ లోపల ఇంఛార్జుల నియామకం పూర్తిచేయాలని పార్టీ అధినాయకత్వం‌ టార్గెట్ గా పెట్టుకుంది. వీరందరికీ డిసెంబర్ నెలాఖరులో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ప్రముఖులకు పార్టీలోకి ఆహ్వనాలు

ప్రముఖులకు పార్టీలోకి ఆహ్వనాలు

పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్న వారిని పార్టీలో చేర్చుకోవాలని‌ పవన్‌కళ్యాణ్ భావిస్తున్నారు.వీరితో పాటు సామాజిక సేవలో ఉన్న వారిని, వివిధ రంగాల్లోని ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించాలని జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ యోచిస్తున్నారని సమాచారం.

ప్రజల్లోకి వెళ్ళేందుకు పవన్ ప్లాన్

ప్రజల్లోకి వెళ్ళేందుకు పవన్ ప్లాన్

ఈ ఏడాది మార్చి నుంచే పవన్ ప్రజల్లోకి వెళ్ళాలని భావించారు. కానీ, కొన్ని కారణాలతో ఈ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయారు. తర్వాత విజయవాడ పర్యటన సందర్భంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ప్రజల్లోకి వస్తానని పవనే స్వయంగా ప్రకటించారు. కానీ, పరిస్థితులు అనుకూలలించలేదు. 2018లో పవన్‌కళ్యాణ్ పాదయాత్ర ద్వారానో, మరో రూపంలో ప్రజల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు.

English summary
Janasena chief Pawan Kalyan will recruiting 840 members as incharges for 42 parliament segments in Two telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X