వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాది వైపు బీజేపీ చూపు: మోడీకి భారీ షాక్, పవన్ సంచలన నిర్ణయం..చెక్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఏపీ, తెలంగాణ నుంచే కాదు.. దక్షిణాది రాష్ట్రాల పేరుతో టార్గెట్ చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఏపీ, తెలంగాణ నుంచే కాదు.. దక్షిణాది రాష్ట్రాల పేరుతో టార్గెట్ చేస్తున్నారు.

ఇప్పటికే రెండుసార్లు తన ప్రెస్ మీట్లో దక్షిణాది పైన ఉత్తరాది పెత్తనం అని ధ్వజమెత్తారు. తాజాగా, మరో షాకింగ్ నిర్ణయంతీసుకున్నారు.

మొన్న జల్లికట్టు ఉద్యమకారుల మీద పోలీసులు జరిపిన దాడి, నిన్న ఏపీలో పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామని మాట తప్పిన కేంద్రంపై శాంతియుత నిరసనకు వెళ్తున్న విద్యార్థులను, యువతని పోలీసులు అరెస్టు చేయడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పవన్ ట్వీట్ చేశారు.

pawan kalyan

అందుకు నిరసనగా దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసనను వైజాగ్‌లోని ఆర్కే బీచ్ ఒడ్డున మార్చి నెలలో చేసేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

తమిళనాడులో ఇప్పుడిప్పుడే ఎదుగుదామని బీజేపీ అనుకుంటోంది. ఏపీ, తెలంగాణల రాష్ట్రాలలోను ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. కేరళలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు గెలుచుకొని ఖాతా తెరిచింది. దక్షిణాదిన ఇప్పుడిప్పుడే కమలం వికసిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్.. చెక్ చెప్పే విధంగా దక్షిణాది అంటూ మాట్లాడుతుండటం గమనార్హం.

English summary
Jana Sena chief Pawan Kalyan plans to South Indian self respect peaceful protest in March month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X