వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా: పవన్ పాదయాత్ర, బాబు, జగన్‌కు చెక్ పెట్టే జనసేన ప్లాన్ ఇదే!

2019 ఎన్నికల కోసం జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకొంటున్నారు. పార్టీని ఎన్నికల కోసం సిద్దం చేస్తున్నారు. మరో వైపు 2018 జనవరి నుండి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళాలని యోచిస్తున్నార

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019 ఎన్నికల కోసం జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకొంటున్నారు. పార్టీని ఎన్నికల కోసం సిద్దం చేస్తున్నారు. మరో వైపు 2018 జనవరి నుండి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళాలని యోచిస్తున్నారు. అయితే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంతో పవన్ కళ్యాణ్ ప్రజల్లో పాదయాత్ర చేసే యోచనలో ఉన్నట్టు జనసేన వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే ఈవిషయమై కొన్ని రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Recommended Video

Pawan Kalyan recruiting 840 members as incharges

టార్గెట్ 2019: 840 మంది ఇంఛార్జీలు, ప్రముఖులకు జనసేన తీర్థం, పవన్ ప్లాన్ ఇదే!టార్గెట్ 2019: 840 మంది ఇంఛార్జీలు, ప్రముఖులకు జనసేన తీర్థం, పవన్ ప్లాన్ ఇదే!

2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్‌కళ్యాణ్ అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే అనంతపురం జిల్లాలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

పవన్ దారెటు?: లెఫ్ట్‌తో జట్టు కట్టేనా, జనసేన ప్లాన్ ఇదే!పవన్ దారెటు?: లెఫ్ట్‌తో జట్టు కట్టేనా, జనసేన ప్లాన్ ఇదే!

2014 ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి, టిడిపి కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని బిజెపి పక్కన పెట్టింది.దీంతో బిజెపి నేతలపై పవన్ సీరియస్ అయ్యారు. ఈ విషయమై టిడిపి నేతల తీరును కూడ పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. రానున్న ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రత్యేక హోదాపై ప్రజల్లోకి పవన్

ప్రత్యేక హోదాపై ప్రజల్లోకి పవన్

2014 ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని బిజెపి ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చింది. అయితే ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏపీకి లాభం కంటే నష్టమని విపక్షాలు ఆరోపణలు చేశాయి. ప్రత్యేక హోదా కావాలంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ప్రజల్లో ఉద్యమాన్ని రగిల్చారు. 2019 ఎన్నికల నాటికి పార్టీని ఎన్నికలకు సిద్దం చేసేందుకుగాను ప్రత్యేక హోదా అంశాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకొన్నారు. 2018 జనవరి నుండి ప్రత్యేక హోదా అంశంతో పాదయాత్ర నిర్వహించనున్నారని సమాచారం.

ప్రత్యేక హోదాతో లాభాలు

ప్రత్యేక హోదాతో లాభాలు

ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏపీ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనాలు లభించనున్నాయనే అంశాలను పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా కారణంగా ఏ రకంగా ప్రయోజనాలు ఉన్నాయనే విషయాలపై పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రత్యేక ప్యాకేజీతో ఏపీ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందనే విషయాలను ప్రస్తావించనున్నట్టు చెబుతున్నారు.

రైల్వే జోన్ అంశంపై పోరాటం

రైల్వే జోన్ అంశంపై పోరాటం

విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ విషయమై పవన్ కళ్యాణ్ ఆందోళన చేయాలని భావిస్తున్నారని సమాచారం. విశాకు రైల్వే జోన్‌ను ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోందనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది. దీంతో ఈ అంశంపై కూడ పోరాటం చేయడం వల్ల రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

ప్రత్యేక హోదా విషయమై బిజెపి తీరుపై నిప్పులు

ప్రత్యేక హోదా విషయమై బిజెపి తీరుపై నిప్పులు

ప్రత్యేక హోదా విషయమై బిజెపి తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టే అవకాశం లేకపోలేదు. 2014 ఎన్నికల సమయంలో బిజెపి నేతలు ఇచ్చిన హమీలను పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. దక్షిణాదిపై బిజెపి చూపుతున్న వివక్షను కూడ ప్రధానంగా పవన్ ప్రస్తావించే అవకాశం లేక.పోలేదు. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను మరోసారి లేవనెత్తడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

English summary
Janasena chief pawan kalyan planned to struggle on special status.From 2018 january onwards Pawan kalyan may start padayatra .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X