వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాజకీయాలు నేనూ చేయగలను కానీ: బాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక, నిన్న అలా, నేడు ఇలా

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు జారీ చేశారు. తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరును చేతకానితనంగా భావించవద్దని ఘాటుగా చెప్పారు. సమస్యలపై తాను స్పందిస్తానని చెప్పారు.

Recommended Video

Polavaram Project Politics In Ap | Oneindia Telugu

పవన్ కళ్యాణ్! దాని గురించి మాట్లాడు: రోజా దిమ్మతిరిగే షాక్, వాణీ విశ్వనాథ్‌పై సైపవన్ కళ్యాణ్! దాని గురించి మాట్లాడు: రోజా దిమ్మతిరిగే షాక్, వాణీ విశ్వనాథ్‌పై సై

ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలా నిగ్రహంగా రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. పదునైన, బలమైన రాజకీయాలు నేను కూడా చేయగలనని చెప్పారు. నేను చేసే పనులు కొన్నిసార్లు ప్రభుత్వానికి మద్దతుగా, మరికొన్నిసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయన్నారు.

పరకాలా! చిరు నోరులేనివాడు, ఆ రోజు నేనే ఉండిఉంటే, భార్యను కూర్చోబెట్టావ్: పవన్, జగన్‌పైనాపరకాలా! చిరు నోరులేనివాడు, ఆ రోజు నేనే ఉండిఉంటే, భార్యను కూర్చోబెట్టావ్: పవన్, జగన్‌పైనా

చంద్రబాబుకు కితాబు

చంద్రబాబుకు కితాబు

సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టే తాను 2014 ఎన్నికల్లో ఆయనకు మద్దతు పలికానని పవన్ కళ్యాణ్ చెప్పారు. చెప్పిన సమస్యలు విని ఆయన పరిష్కరిస్తారని కితాబిచ్చారు. ఏ సమస్యనైనా విని పరిష్కరించేందుకు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డాహరు.

 ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టట్లేదు

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టట్లేదు

ప్రస్తుత పరిస్థితుల కారణంగానే తాను చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ దానిని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు. సమస్యలపై తాను ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటానని చెప్పారు.

 ఎంత రాజధాని కట్టినా ఫలితం ఉండదు

ఎంత రాజధాని కట్టినా ఫలితం ఉండదు

ప్రజలు ఆనందంగా లేనప్పుడు ఎంత పెద్ద రాజధాని కట్టినా ఫలితం ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నానని, ప్రజల సమస్యపై మరింత విస్తృతంగా పోరాడుతానని చెప్పారు. డబ్బులు లేనప్పుడు ఆడంబరాలు ఎలా అన్నారు. ఆయన మంగళవారం మంగళగిరిలో జనసేన కార్యాలయం కోసం స్థలాన్ని పరిశీలించారు.

 నిన్న అలా

నిన్న అలా

పవన్ కళ్యాణ్ మొదటి రెండు రోజుల పాటు చంద్రబాబుపై తీవ్రంగానే విమర్శలు చేశారు. చంద్రబాబు వాడుకొని వదిలేసే రకం అని తనకు కొందరు చెప్పారని, ఆ విషయం తనకు తెలియదా అని బుధవారం నాటి విశాఖ పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం పోలవరం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా తప్పులు చేయనప్పుడు లెక్క చెబితే ఏమిటి, మీ తురు వల్ల నాకూ అనుమానం కలుగుతోందన్నారు.

నేడు ఇలా

నేడు ఇలా

ఇప్పుడు మాత్రం ఓ వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే మరోవైపు సానుకూలంగా మాట్లాడారు. విభజన నేపథ్యంలో ఏపీకి ఇబ్బందులు ఉంటాయని, ఈ పరిస్థితుల కారణంగానే తాను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదల్చుకోలేదని చెప్పడంతో పాటు సమస్య విని పరిష్కరించేందుకు మొగ్గు చూపుతారని చెప్పడం గమనార్హం.

English summary
Jana Sena party chief Pawan Kalyan on Friday praised Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X