వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవీ నరసింహారావు భారతరత్నమే: కేసీఆర్‌కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా పీవీ నరసింహారావు దేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు, క్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతమని కొనియాడారు.

కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

ఆదివారం పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను సంవత్సరంపాటు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన సీఎం కే చంద్రశేఖర్ రావుకి అభినందనలు తెలియజేశారు.

పీవీ నరసింహారావు భారతరత్నమే..

పీవీ నరసింహారావు భారతరత్నమే..


భారత జాతి గర్వించదగిన తెలుగు ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు అని అన్నారు. భారతరత్న పురస్కారానికి అర్హుడైన మహా మనీషి పీవీ అని.. ఆయన గురించి ఎంత చెప్పినా కొంత మిగిలిపోయే ఉంటుందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమకారునిగా, తెలంగాణ విముక్తి పోరాట యోధునిగా, పదిహేడు భాషలపై పట్టు ఉన్న భాషాకోవిదునిగా, రాజనీతిజ్ఞుడుగా, పాత్రికేయునిగా, కవిగా, రచయితగా, న్యాయకోవిదునిగా... ఇలా ఇన్ని సలక్షణాలు కలిగిన వారు బహు అరుదుగా వుంటారన్నారు.

పీవీ ప్రజ్ఞ ఊహకందనిది..

పీవీ ప్రజ్ఞ ఊహకందనిది..


ముఖ్యంగా సరళీకృత ఆర్ధిక విధానాల ద్వారా మనదేశాన్నిస్వావలంబన వైపు మళ్లించిన తీరు, క్లిష్ట సమయంలో ప్రధానిగా భాద్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని ఆయన నడిపిన విధానంలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు పవన్. మౌనంగా ఉంటూనే సమస్యలకు పరిష్కారం చూపే ఆయన ప్రజ్ఞ ఊహలకు అందనిదన్నారు.

మహోన్నత వ్యక్తికి మా నీరాజనాలు

మహోన్నత వ్యక్తికి మా నీరాజనాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే కాదు... లెక్కకుమిక్కిలి పదవులను అధిరోహించిన పీవీ .నరసింహారావు, ఆ పదవులకు వన్నె తీసుకువచ్చి వాటికి ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టారన్నారు.ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగు బిడ్డగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి సందర్బంగా తన తరఫున, జనసేన పార్టీ తరఫున నీరాజనాలు అర్పిస్తున్నట్లు జనసేనాని తెలిపారు.

English summary
pawan kalyan praises pv narasimha rao for his services to the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X