వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్ .. పవన్ కు మద్దతుగా చిరంజీవి సతీమణి కూడా ..

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రథం అగ్నికి ఆహుతైన ఘటనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుంబిగించారు. ఆలయాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ధర్మ పరిరక్షణ దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించి నిరసన తెలపాలని కూడా పిలుపునిచ్చారు.

అంతర్వేదిలో కొనసాగుతున్న 144 సెక్షన్: అడుగడుగునా పోలీసుల పహారా..రీజన్ ఇదే !! అంతర్వేదిలో కొనసాగుతున్న 144 సెక్షన్: అడుగడుగునా పోలీసుల పహారా..రీజన్ ఇదే !!

 సనాతన ధర్మ రక్షణ కోసం దీపం వెలిగించిన పవన్ ... మద్దతుగా వదిన సురేఖ

సనాతన ధర్మ రక్షణ కోసం దీపం వెలిగించిన పవన్ ... మద్దతుగా వదిన సురేఖ

అంతర్వేది ఘటనతో ,భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం అందరూ దీక్షలు చేయాలని కోరిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం మన కర్తవ్యం అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో ఒక దీపాన్ని వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెలిగించిన దీపం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చిరంజీవి సతీమణి సురేఖ తులసి మొక్కకు పూజ చేసి దీపం వెలిగించారు. ఆ ఫోటోను రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలిగించి పవన్ కు మద్దతుగా అభిమానులు , జనసైనికులు

రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలిగించి పవన్ కు మద్దతుగా అభిమానులు , జనసైనికులు

పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం దీపాలు వెలిగించి పవన్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తన దీక్షకు మద్దతు ఇస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్వేదిలోని రథం దగ్ధం ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ దేవాలయాల పై జరుగుతున్న దాడులకు నిరసనగా దీపాలు వెలిగించాలని పిలుపునివ్వడం మాత్రమే కాకుండా స్వయంగా ఆయన దీపారాధన చేసి bharatiya culture matters హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం పవన్ దీక్ష

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం పవన్ దీక్ష

మొత్తానికి పవన్ కళ్యాణ్ దేవాలయాల పరిరక్షణ కోసం తనదైన శైలిలో దీక్షలు చేస్తూ, హిందూ సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంపై శ్రద్ధ వహించాలని తన దీక్షల ద్వారా తెలియజేస్తున్నారు.


అంతర్వేది ఘటన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత కూడా ఆయన సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే సరిపోదని వ్యాఖ్యానించారు.

Recommended Video

Pawan Kalyan పై Sanchaita Gajapathi Raju ఆరోపణ | Mansas Trust వ్యవహారం పై..!!
ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అంటూ పవన్ ధ్యానం

ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అంటూ పవన్ ధ్యానం


ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అంటూ స్వయంగా సంకల్పం చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ ధ్యానం చేశారు. పవన్ పిలుపుకు విశేష స్పందన వచ్చింది . రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, నందిగామ, శ్రీకాళహస్తి, కైకలూరు, నెల్లూరు, మదనపల్లె, తిరుపతి, తదితర ప్రాంతాల్లో జనసైనికులు తమ నివాసాల్లో దీపాలు వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతు తెలిపారు. పవన్ ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత అని ఈ దీక్ష ద్వారా , దీపాలు వెలిగించే కార్యక్రమం ద్వారా తెలియజేశారు .

English summary
With the Antarvedi incident, Pawan Kalyan, wanted everyone to be initiated to prevent such incidents from happening in the future, commented that it is our duty to protect the temples. To this end, Pawan Kalyan lit a lamp in his farm house and started the Sanatana Dharma conservation Program. Currently, the photo of the lamp lit by Pawan Kalyan is going viral on social media. At the call of Pawan Kalyan, Chiranjeevi's wife Surekha worshiped the basil plant and lit the lamp. Ram Charan posted the photo on his Twitter account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X