వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే బిజినెస్ చేయట్లేదు: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ ఖాన్ గెలుపుపై..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

పాకిస్తాన్ నేత ఇమ్రాన్ ఖాన్ పై పవన్ ప్రసంశలు

భీమవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భీమవరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. భీమవరం, ఉండి నియోకవర్గాల జన సైనికులు పాల్గొననున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పోరాట యాత్రకు భీమవరం నుంచి పవన్ స్వీకారం చుడుతున్నారు. మూడ్రోజులుగా పవన్ వివిధ వర్గాల ప్రజలతో కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఈ మేరకు జనసేన ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.

గురువారం నాటి తన పర్యటనలో పవన్ పలుచోట్ల మాట్లాడారు. భీమవరంలోని డాక్టర్‌ బీవీ రాజు విద్యాసంస్థలకు వెళ్లిన పవన్ అమ్మాయిలను ఉద్దేశించి.. ఆడపడుచులకు నమస్కారం అన్నారు. ఆయన అలా అనడంతో అందరూ చప్పట్లు చరిచి, కేరింతలు కొట్టారు. తాను భీమవరంలోనే పీయూసీ పరీక్షకు హాజరయ్యానని, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం అనేది ఉండాలని, ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడితేనే లక్ష్యం చేరుకోగలమన్నారు. ఈ సందర్భంగా పలువురి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మతపర శక్తులు మన ఐక్యతను దెబ్బతీయలేవన్నారు. ముస్లీం కుటుంబాల్లో ఆడపిల్లలు చదువుకునేలా జనసేన కార్యాచరణ రూపొందిస్తుందన్నారు.

పవన్‌కు క్షమాపణలు చెప్పకుంటే: జగన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తోన్న కాపునాడుపవన్‌కు క్షమాపణలు చెప్పకుంటే: జగన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తోన్న కాపునాడు

నరేంద్ర మోడీ లాంటివాడికి నచ్చకుంటే

నరేంద్ర మోడీ లాంటివాడికి నచ్చకుంటే

చాలామందికి డబ్బు సంపాదనే ముఖ్యమని, ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాడికి నచ్చకుంటే పెద్ద నోట్లు రద్దులా ప్రకటన చేస్తే ఆ కాగితాలు ఎందుకు పనికి రావని పవన్ అన్నారు. పుస్తకాలు చదివితే ఐశ్వర్యం తీసుకు వస్తాయన్నారు. భారత దేశ చరిత్రను విదేశీయులు కొనియాడారన్నారు. తనకు చాలామందితో పాటు తన తల్లి కూడా రోల్ మోడల్ అన్నారు. ఇంట్లో లైటు వేయగానే మా అమ్మ నమస్కరించేదని, ఎందుకు అలా చేస్తున్నావని అడిగితే థామస్‌ ఆల్వా ఎడిసన్‌ బల్బు కనిపెట్టాడని, అందువల్లే ఈ వెలుగు ఉందని చెప్పిందన్నారు.తాను భీమవరం డీఎన్ఆర్ కాలేజీలో పీయూసీ పరీక్ష రాశానని, ఈ పరీక్ష తన తల్లికి కూడా తెలియకుండా రాశానన్నారు

అన్నయ్య, వదినలు నచ్చచెప్పారు

అన్నయ్య, వదినలు నచ్చచెప్పారు


ఓ సమయంలో తాను చదువులో వెనుకబడిపోవడాన్ని జీర్ణించుకోలేక తుపాకీతో కాల్చుకుని చనిపోవాలని అనుకున్నానని, అప్పుడు అన్నయ్య, వదినలు నచ్చచెప్పడంతో నిర్ణయం మార్చుకున్నానని చెప్పారు. ఇటీవల విద్యార్థులు ఆత్మహత్యలకు ఒత్తిడే కారణమన్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తానని చెప్పారు. కేవలం మానసిక ఒత్తిడే తప్పా శారీరక దారుఢ్యం లేకుండా పోయిందన్నారు.

 ఇమ్రాన్ ఖాన్ కల 22కు ఫలించింది

ఇమ్రాన్ ఖాన్ కల 22కు ఫలించింది

ఇరవై రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌లో పార్టీ ఏర్పాటు చేసిన ఇమ్రాన్‌ఖాన్‌ ఓపిక ఇప్పటికి ఫలించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క రాత్రిలో మార్పు రాదన్నారు. ఎవరికైనా ఆశయం, సహనం ఉండాలన్నారు. అందుకే తాను మరో ఇరవై అయిదేళ్లు రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు.

నేను వారిలా దిగజారను

నేను వారిలా దిగజారను

కొత్త వారు రాజకీయాల్లోకి రావొద్దని భావించే వారు వ్యక్తిగత విమర్శలు చేస్తారని జగన్‌ను ఉద్దేశించి పవన్ అన్నారు. వారు చేసే విమర్శలకు ప్రతి విమర్శలతో దిగజారనని తెలిపారు. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయో అర్థం చేసుకోవాలన్నారు.

అందుకే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేదు

అందుకే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేదు

రాజకీయాలను డబ్బుతో ముడిపెట్టేశారని, ఎమ్మెల్యేగా గెలవాలంటే రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు ఉండాలన్న స్థాయికి రాజకీయాలు తీసుకెళ్లారని పవన్ అన్నారు. సామాన్యుడికి రాజకీయాలు అందకుండా చేస్తున్నారన్నారు. సీఎం కొడుకే సీఎం కావాలా అని ప్రశ్నించారు. ఒక న్యాయవాది, రైతు కూలీ, బిడ్డలు సీఎం కాకూడదా అన్నారు. కష్టం తెలియకుండా ముఖ్యమంత్రి కొడుకు అనే కారణంతో దొడ్డిదారిన మంత్రి కుర్చీ ఎక్కి మమ్మల్ని తొక్కుతానంటే ఎట్లా అని లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. హెరిటేజ్‌ ఫ్యాక్టరీని నిలబెట్టడానికి విజయా డెయిరీని చంపేశారని, నాయకుడికి వ్యాపారాలు ఉంటే న్యాయం చేయలేడని అందుకే తనకు అవకాశం ఉన్నా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేదన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan public meeting in Bhimavaram on friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X