వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ మాటేమిటి: దేశభక్తిపై బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రశ్నలు, ఓ ట్వీట్‌పై 'సారీ'

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ పైన మూడో రోజు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఈ రోజు (శనివారం) దేశభక్తి అంశంపై స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ పైన మూడో రోజు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఈ రోజు (శనివారం) దేశభక్తి అంశంపై స్పందించారు. ఆయన జేఎన్యూ-ఢిల్లీ ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రేపు ప్రత్యేక హోదా పైన స్పందిస్తానని పేర్కొన్నారు.

గోవాలో ఆ దమ్ముందా?: బీజేపీకి పవన్ ఐదు ప్రశ్నలు, రోజుకొకటి..

తమ దేశభక్తిని ఎవరి వద్ద నిరూపించుకోవాలని పవన్ ప్రశ్నించారు. పార్టీ విధానాల ఆధారంగా దేశభక్తిని గుర్తించలేమన్నారు. రాజకీయ పార్టీల సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించరని ప్రశ్నించారు. కుటుంబం, స్నేహితులతో కలిసి సినిమాకు వస్తే అది దేశభక్తికి పరీక్షా కేంద్రం కావొద్దన్నారు.

విలువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తికి నిజమైన అర్థమన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశభక్తి లేదని చెప్పడం సరికాదన్నారు. కులం, మతం ఇవన్నింటిని పక్కన పెట్టడమే దేశభక్తి అని అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan questions BJP on partiotism on third day

ఓ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయలేమన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశభక్తి కాదని చెప్పడం సరికాదన్నారు. ఎవరైనా విభేదిస్తే వారు అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. చర్యలు తీసుకుంటే జేఎన్టీయులో అయినట్లుగా ఎదురు తిరుగుతుందని అభిప్రాయపడ్డారు. జేఎన్యూలో విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టారని, కానీ వారు దేశద్రోహానికి పాల్పడటలేదని ఆ తర్వాత రుజువైందన్నారు.

బీజేపీపై పవన్ కళ్యాణ్ దాడి: అంతా తేలిపోయింది, పక్కా ప్లాన్?

కాగా, తన ట్వీట్‌లో ఏడు వరుస ట్వీట్లు చేశారు. అందులో నాలుగో ట్వీట్లో జేఎన్టీయూ అని పేర్కొన్నారు. దీనిపై ఆ తర్వాత మరో రెండు ట్వీట్లు చేశారు. తాను చేసిన ఓ ట్వీట్లో జేఎన్టీయూ అని పేర్కొన్నానని, అది జేఎన్యూ-ఢిల్లీ అని పేర్కొన్నారు. జేఎన్యూ-ఢిల్లీ బదులు జేఎన్టీయూ రాసినందుకు సారీ అని చెప్పారు.

English summary
Pawan Kalyan questions BJP on partiotism on third day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X