వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడు సిద్ధాంతాలు-12 హామీలు: జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన పవన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కొత్త సిద్ధాంతాలను రూపొందించిన పవన్ కళ్యాణ్

పశ్చిమగోదావరి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తమ పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికలకు కొద్ది నెలలుండగానే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. అయితే, ఎన్నికల సమయంలో తుది మేనిఫెస్టోను మరోసారి విడుదల చేస్తామని పవన్ ఇప్పటికే చెప్పారు.

కాగా, ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న పవన్‌.. తాజాగా పార్టీ మేనిఫెస్టో (దార్శనిక పత్రం) విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఆయన భీమవరంలోని మావుళ్లమ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను పొందుపర్చారు.

Pawan Kalyan releases janasena party primary manifesto

జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు ఇవే..

1. కులాలను కలిపే ఆలోచనా విధానం

2. మతాల ప్రస్తావన లేని రాజకీయం

3. భాషలను గౌరవించే సంప్రదాయం

4. సంస్కృతులను కాపాడే సమాజం

5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం

6. అవినీతిపై రాజీలేని పోరాటం

7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం

మేనిఫెస్టోలో మచ్చుతునకలంటూ హామీలు:

1. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు

2. గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు

3. రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ

4. బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు

5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు

6. కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పన

7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం

8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్‌

9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు

10. ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు

11. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు

12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

కాగా, తాము మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలకు కట్టుబడి ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

English summary
Janasena president Pawan Kalyan on Tuesday released janasena party primary manifesto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X