వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపులు, కాపు రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు: సరికొత్త నేత రాబోతున్నాడంటూ..

|
Google Oneindia TeluguNews

ధవళేశ్వరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం కవాతు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లపై ఆయన మాట్లాడారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను సమానంగా చూసే జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మనస్ఫూర్తిగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు. తాను స్వర్గీయ నందమూరి తారక రామారావును ఆదర్శంగా తీసుకున్నానని చెప్పారు.

Recommended Video

నన్ను సీఎం అనండి అని అడిగి పిలిపించుకున్న పవన్

కవాతులో కారులోనే పవన్ డ్యాన్స్ చేస్తూ ఉత్సాహం: తొక్కిసలాట డౌట్, భారీగా పోలీసులుకవాతులో కారులోనే పవన్ డ్యాన్స్ చేస్తూ ఉత్సాహం: తొక్కిసలాట డౌట్, భారీగా పోలీసులు

తాను కాపులను దూరం పెడుతున్నానని కొందరు చెబుతున్నారని, కానీ ఎందుకు దూరం పెడతానని ప్రశ్నించారు. తనకు అన్ని కులాలు, మతాలు సమానమేనని చెప్పారు. నేను భారత రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తిని అన్నారు. ప్రజలు అంతా సమానమని భావిస్తానని చెప్పారు. ఏ పని చేసినా త్రికరణశుద్ధితో పని చేస్తానని అన్నారు. తాను కులాల ఐక్యతను కోరుకుంటానని చెప్పారు.

కాపు రిజర్వేషన్లపై

కాపు రిజర్వేషన్లపై

బ్రిటిష్ కాలంలో కాపులు సహజంగా బీసీ కులానికి చెందినవారుగా ఉండేవారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపు కులానికి చెందిన వారు కూడా వెనుకబడిన వారు ఎందరో ఉన్నారని చెప్పారు. నా బంధువుల్లోనే తాను అసంఘటిత కార్మికులను చూశానని చెప్పారు. సోడా బండీ, ఇడ్లీ బండి, బస్టాండ్ వద్ద బండ్లు పెట్టుకొని బతికిన వారు ఉన్నారని చెప్పారు. తనకు వేల కోట్లు ఉన్న బంధువులు లేరని చెప్పారు. తన బంధువులంతా సామాన్యులు అన్నారు. తన తల్లి నెల్లూరు బలిజ కుటుంబానికి చెందిన వారు అన్నారు.

 దొంగచాటుగా కాకుండా సూటిగా మాట్లాడుతున్నా

దొంగచాటుగా కాకుండా సూటిగా మాట్లాడుతున్నా

ఇదంతా అందరికీ తెలియాలనే చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. నా గురించి ఎవరో చెప్పేబదులు దొంగచాటుగా కాకుండా సూటిగా మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఎన్నికల ఎత్తుగడ కోసం మాట్లాడటం లేదని, అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నానని అన్నారు. ముస్లీంల వెనుకబాటు గురించి ఎలా మాట్లాడుతానో కాపుల గురించి కూడా అలాగే మాట్లాడుతానని చెప్పారు.

కాపులకు అన్యాయం జరిగితే

కాపులకు అన్యాయం జరిగితే

కాపు రిజర్వేషన్ల అంశం చాలా బాధ్యతాయుతమైనదని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపులకు అన్యాయం జరిగితే ,ఈ అంశాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కాపులకు అండగా ఉంటామని అన్నారు. తాను ఏ కులంలో పుట్టాలో, ఏ భాష మాట్లాడాలో అనుమతి తీసుకోని పుట్టనని వ్యాఖ్యానించారు. నేను ఏ కులంలో పుట్టినా పవన్ కళ్యాణ్ ఇలాగే ఉండేవాడన్నారు.

సరికొత్త నేత రాబోతున్నారు

సరికొత్త నేత రాబోతున్నారు

చంద్రబాబు అయినా, ఎవరైనా తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతీయవద్దని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. సరికొత్త వ్యవస్థ రాబోతుందని, సరికొత్త ప్రభుత్వం రాబోతుందని, సరికొత్త పాలసీలు రాబోతున్నాయని, సరికొత్త నేత రాబోతున్నారని, పర్యావరణం అద్భుతంగా ఉండే పాలసీలు, మన జలాలు కాపాడుకునే పాలసీలు రాబోతున్నాయని చెప్పారు.

 గొంతెత్తి భారత్ మాతాకీ జై అంటూ, ఉత్తరాదికి దేశభక్తి వినపడాలని..

గొంతెత్తి భారత్ మాతాకీ జై అంటూ, ఉత్తరాదికి దేశభక్తి వినపడాలని..

ఈ సందర్భంగా చివర్లో పవన్ కళ్యాణ్ గొంతెత్తి మరీ పలు కవితలు చెప్పారు. కలలు కను.. కలలు కను దేశాన్ని మార్చేందుకు కలలు కను అని నినదించారు. దిక్కులు పిక్కటిల్లేలా దద్దరిల్లాలని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ద్దదరిల్లేలా మార్పు వచ్చేలా, దిక్కులు పిక్కటిల్లేలా దద్దరిల్లాలని అన్నారు. జైహింద్ అంటూ ప్రసంగం ముగించారు. ఆ తర్వాత భారత్ మాతాకీ జై అని జనసైనికులతో పలికించారు. ప్రధానికి మన దేశభక్తి చెబుదామని, ఉత్తర భారత నాయకులకు దక్షిణ భారత దేశభక్తి చెబుతామని, భారతమాత ముద్దుబిడ్డలం అని చెబుదామని చెబుతూ.. గట్టిగా భారత్ మాతాకీ జై అనాలని జనసైనికులకు సూచించారు. అభిమానులకు కూడా పలుమార్లు సూచనలు చేశారు. కరెంట్ తీగలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan responded on Kapu reservations on Monday in Jana Sena Kavathu public meeting in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X