హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడు ఓట్లు ఎత్తుకెళ్లే గ్యాంగులు చూస్తున్నాం...టిడిపి నేతల స్పందన కోసం చూస్తున్నా:పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఎపిలో టిడిపి ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఓట్ల గల్లంతు వ్యవహారంపై ఆయన అధికార పార్టీ తెలుగుదేశంపై మండిపడ్డారు.

ట్విట్టర్ వేదికగా ఆయన టిడిపి ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల రాయలసీమ, కోస్తా ఆంధ్రాల్లోని పటు ప్రాంతాల్లో సర్వే పేరిట ఒక టీమ్ ఓట్ల గురించి తెలుసుకుంటూ తిరిగిందని, మీరు ఏ పార్టీకి ఓటేస్తారన్న ఆ సర్వే నిర్వాహకుల ప్రశ్నకు ఎవరైనా అధికార పార్టీ కాకుండా వేరే పార్టీ పేరు చెబితే వారి ఓట్లు గల్లంతు అవుతున్నాయని జనసేన ఆరోపణల నేపథ్యంలో...ఈ విషయమై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో టిడిపిని నిలదీశారు.

స్పా సర్వే పేరిట కొందరు గుంటూరు, రాయలసీమల్లో కొందరు వ్యక్తులు ఒక యాప్ చూపిస్తూ...ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారో కొన్ని సార్లు సూటిగా అడగడం ద్వారా అలా సాధ్యం కాని సందర్భాల్లో వివిధ ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు వేస్తూ...వారు అధికార పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేస్తారని తెలియగానే కొద్ది సేపటికే వారి ఓట్లు గల్లంతు అయిపోతున్నాయని సోషల్ మీడియాలో తొలుత జనసేన కార్యకర్తలు వీడియోలు పెట్టగా అవి వైరల్ గా మారాయి.

Pawan Kalyans anger against TDP leaders on the removal of votes

దీంతో అప్రమప్తమైన వైసిపి శ్రేణులు సైతం ఇదే సర్వే నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులను పట్టుకొని వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సోస్ట్ చేశాయి. అంతేకాదు వీరంతా అధికారపార్టీ టిడిపికి మద్దతుగా సర్వే పేరిట ఇలా ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్నారంటూ...వారు టిడిపికి చెందిన వారే అనేందుకు ఆధారంగా చంద్రబాబుతో, లోకేష్ తో సర్వే నిర్వాహకులు దిగిన ఫోటోలను ఈ వీడియోల్లో పొందపరచడం చేశారు. దీనిపై ఓటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుండగా ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.." చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగ్‌లు గురించి వింటాం...కానీ ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులను ఇప్పుడు చూస్తున్నాం...మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారా?...అని నేను ఎదురు చూస్తున్నాను...మా పార్టీ నేతలు త్వరలోనే ఈ వ్యవహారంపై ఓ నిర్ణయం తీసుకొని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నాము"...అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ జాతీయ పత్రికలో పబ్లిష్ అయిన వార్త కటింగ్‌ను పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

English summary
Hyderabad:Pawan Kalyan once again fire over TDP government and their party leaders. He was blamed on the Telugu Desam Party for removal of votes in the name of survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X