• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కల్యాణ్ వివాదం:సీరియస్...సినిమాటిక్ కూడా;చివరకు ఏమవుతుంది?

By Suvarnaraju
|

ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కళ్యాణ్ తన ఎంటైర్ పొలిటికల్ కెరీర్ లో వేయనన్ని ప్రశ్నలు ఈ రెండు రోజుల్లో వేశాడంటే అతిశయోక్తి కాదు...అంతేకాదు గతంలో పవన్ ప్రశ్నల్లో లేని సీరియస్ నెస్ పవన్ కళ్యాణ్ ఇప్పటి ప్రశ్నల్లో కనిపిస్తోంది. బహుశా ఇది తనకు చెందిన వ్యవహారం కావడం వల్లనేమో ఆ డెప్త్...

నిన్న ఆరోపణాస్త్రాలతో జనాల మెదడుల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించిన పవన్...నేడు తానే నేరుగా అనేక ప్రశ్నలు సంధించాడు. ఇక ఆ ప్రశ్నలు కూడా సమాజంలో లబ్దప్రతిష్టుల్ని ఉద్దేశించినవి...వాటి జవాబులు సంచలనం సృష్టించేవి...మరైతే వాటికి సమాధానాలు ఎవరు చెబుతారు...ఇంకెవరు పవన్ కళ్యాణే చెప్పాలి...అయితే పవన్ ఆ పని ఇప్పడు చేస్తారా? లేక ఇప్పటికి కేవలం ప్రశ్నలు సంధించడంతోనే పరిపెట్టుకుంటారా?...లేక వాటికి జవాబులు కూడా చెబుతారా?...చెబితే ఏమవుతుంది?...అన్నీ ప్రశ్నలే!...

 పవన్ నేటి ప్రశ్నలు...ఇవే!

పవన్ నేటి ప్రశ్నలు...ఇవే!

  1. నిజమైన "అజ్ఞ్యాతవాసి" మీకుఎవరో తెలుసా??
  2. నాకు ఇష్టమైన స్లోగన్ " ఫ్యాక్షనిస్టుల ఆస్తలుని జాతీయం చెయ్యాలి" అసలు యీ స్లోగన్ వెనకాల కథ కి యీ స్లోగన్ కి సంబంధం ఏంటి?
  3. నిజాలిని నిగ్గు తేలుద్దాం"ప్రోగ్రాం నుంచి మీ Pawan Kalyan(నిజానికిది ప్రశ్న కాదు...కానీ సమాధానం కావాలి)
  4. ఒక రాష్ట్ర కాబినెట్ రాంక్ మంత్రి స్వయానా యీ " అజ్ఞ్యాతవాసి" ని " వాడో blackmailer అని స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని అని "ఒకరి"తో అన్నారు.ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, "ఒకరు" ఎవరు... తెలుసుకోవాలనివుందా !!!
  5. Stay tuned to "బట్టలు విప్పి మాట్లాడుకుందాం" program nunchi - Pawan Kalyan with cameraman Twitter.
 ఇవి చూస్తే...ఏమనిపిస్తుంది?

ఇవి చూస్తే...ఏమనిపిస్తుంది?

చాలా సీరియస్ విషయాలను సినిమాటిక్ గా సంధిస్తున్నట్లుగా ఉంది...అంటే పవన్ అంత సీరియస్ విషయాలను కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడంటే ప్రత్యర్థులను ఏమాత్రం కేర్ చేయడం లేదనుకోవాలా? లేక ఆయన సహజ సిద్దమైన స్వభావానికి అనుగుణంగా అలా టీజ్ చేస్తున్నారని అనుకోవాలా? అంటే...రెండూ నిజమేనని అనుకోవచ్చేమో. అయితే ఈ ట్వీట్లన్నీ ఒకేసారి చేసినవి...ఆ తరువాత కొద్ది గంటల విరామం వరకు ఏ ట్వీట్ వెలువడలేదు. పైగా ఆ ప్రశ్నలను సంధించిన తరువాత తాను సమాధానం ఇస్తానో లేదో కూడ స్పష్టం చేయలేదు?...ఒకవేళ ఇస్తే ఎప్పుడిస్తారనే దానికి క్లారిటీ లేదు...కాబట్టి పవన్ మళ్లీ ట్వీట్ చేసేదాకా వెయిట్ చేయడమే...

 కానీ...వీటి జవాబులే కీలకం...

కానీ...వీటి జవాబులే కీలకం...

కానీ పవన్ కళ్యాణ్ పోరాటం దశ దిశ ఏంటనేది...పవన్ ఈ ప్రశ్నలకు ఇచ్చే జవాబులను బట్టి చాలావరకు అర్థం చేసుకోవచ్చు. పవన్ సమాజంలో అతిముఖ్యమైన వ్యక్తుల గురించి ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తి జవాబులు తెలుసా అని అడగడాన్ని బట్టి ఆ ప్రశ్నలకు ఆయనకు ఆన్సర్ తెలుసు కాబట్టే అడిగాడని ఎవరైనా భావించడం సర్వసాధారణం. అలాంటప్పుడు సమాజంలో అత్యంత సంచలనాత్మకం అయిన ఆ జవాబులను పవన్ ఇప్పు బైటపెట్టేస్తే ఇక ఆయనే చెప్పినట్లు సుదీర్ఘ పోరాటానికి మానసికంగా సంసిద్దుడైనట్లే చెప్పుకోవాలి...లేక గతంలో చాలా సార్లు ప్రశ్నలు సంధించడంలోనే చాలా లేటు...కొన్నిటికి జవాబులే చెప్పని అదే వైఖరి కొనసాగిస్తే మాత్రం పవన్ పోరాటం తీరు గురించి ఆలోచించాల్సిందే...

 మరి...చివరకు ఏమవుతుంది?

మరి...చివరకు ఏమవుతుంది?

పవన్ తాను ఇప్పటికే సంధించిన ఆరోపణలకు ఆధారాలు చూపాలి...తాజాగా సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి...ఇది అనివార్యం...పవన్ వివాదం ముందు ముందు ఏమవుతుందనే విషయానికి సంబంధించి ఇవి చాలా ముఖ్యం. అవే గనుక పవన్ చేయకుంటే ఈ వివాదం సమసిపోయేది గానే భావించవచ్చు...ఒకవేళ పవన్ ఆధారాలు...సమాధానాలు బైటపడ్తే ఈ వివాదం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి...ముఖ్యంగా ఎపికి సంబంధించి రాజకీయంగా...సామాజికంగా...సినీ పరిశ్రమ పరంగా అనేక సంచలనాలకు నాంది పలకడం ఖాయం.

English summary
What's going to happen in the case of Pawan Kalyan's controversy...That is based on the evidences for the allegations made by Pawan kalyan on Friday and answers to Saturday's questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X