• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వంగవీటి రాధా నెత్తిన పాలు పోసిన పవన్ కళ్యాణ్...సీటు కన్ఫామ్ అయింది!

By Suvarnaraju
|

విజయవాడ:రాజకీయాల్లో అంతే! ఎక్కడో ఏదో జరుగుతుంది...కానీ దాని పర్యవసానం ఫలితం...ఊహించని విధంగా ఎవరిదో కొంప కొల్లేరవుతుంది...అంతేకాదు అనూహ్యంగా మరొకరు అందలం ఎక్కడం కూడా జరగొచ్చు...ఇది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో అనేకసార్లు కనిపించిన సత్యం.

తాజాగా ఎపి రాజకీయ పార్టీల్లోనూ ఒక వ్యవహారం అనేక పార్టీలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తోంది. ఆయా పార్టీల నేతల తలరాతలు మారుస్తోంది. ఇంతకీ ఆ వ్యవహారం ఏమిటంటే?...అది పవన్ కళ్యాణ్ తాజా యుద్దం...దాని ప్రభావం వివిధ పార్టీల మీద ఉన్నా...మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్ర వైసిపి నేత వంగవీటి రాధాకు...ఈ వ్యవహారం ఎలా కలిసొచ్చిందనేదే!...పవన్ పరోక్షంగా ఈ బెజవాడ కాపు నేత నెత్తిన పాలు ఎలా పోసాడా అనేదే!...

అవునా...రాధాకు కలిసొచ్చిందా?

అవునా...రాధాకు కలిసొచ్చిందా?

ముందు రాధాకు అసలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దనుకున్నారు...ఆ తరువాత రాధా అడిగే చోట ఎమ్మెల్యే టికెట్ వేరేవారికిచ్చి ఆ తరువాత ఎమ్మెల్సీనో, మంచి నామినేటెడ్ పదవో ఇద్దామనుకున్నారు(అధికారంలోకి వస్తే)...కానీ తాజాగా సమీకరణాలన్నీ మారిపోయాయి. ఇంకోలాగా చెప్పాలంటే రివర్స్ అయ్యాయి. అంటే ఇప్పుడు వంగవీటి రాధా కేమో తాను కోరుకున్న చోటే ఎమ్మెల్యే టికెట్, ముందు ఇదే ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇద్దామనుకున్నారో వారికి ఎమ్మెల్సీ/నామినేటెడ్ పోస్ట్...సో మొత్తం మీద ఫైనల్ గా చెప్పొచ్చేదేమంటే విజయవాడలో వంగవీటి రాధాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిందనేది...

ఇప్పటిదాకా...ఏం జరిగిందంటే?

ఇప్పటిదాకా...ఏం జరిగిందంటే?

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ వంగవీటి రాధాకు ఖరారైందనేది తాజా విశ్వసనీయ సమాచారం. ఈ నియోజకవర్గం టికెట్ కోసం వంగవీటి రాధా ఎంతో ఆశలు పెట్టుకోని...ఆ తరువాత జగన్ తీరు చూసి ఆ సీటు మీద ఆశలు వదులుకొని...ఏం చెయ్యాలా లని అనుచరులతో తర్జనభర్జనలు పడి...ఒకానొకదశలో పార్టీ మారేందుకు కూడా సిద్దపడి...ఆ తరువాత జగన్ తొందర పడొద్దు న్యాయం చేస్తానన్న హామీతో సరే ఏం జరుగుతుంతో చూద్దామని వేచిచూస్తున్న తరుణంలో...రాష్ట్రంలో అనూహ్యంగా పరిణామాలు మారి...రాజకీయంగా టిడిపి ఎదురుదెబ్బలు తింటూండటం, పాదయాత్రలో జగన్ గ్రాఫ్ పెరిగినట్లు కనిపించడంతో మళ్లీ ఆలోచనలో పడిన వంగవీటి రాధాకు పవన్ కళ్యాణ్ అనూహ్య యుద్దం భలే కలిసొచ్చింది. ఎలాగంటే?

రాధా గతం...ఇప్పుడు

రాధా గతం...ఇప్పుడు

గ‌త ఎన్నిక‌ల్లో వంగవీటి రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అక్కడ కమ్మ సామాజికవర్గం ప్రాబల్యంతో పరాజయం పాలయ్యానని భావించిన రాధా త‌న‌కు విజయవాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కావాలని అడుగుతున్నారు. ఆ క్రమంలో ఒకటిన్నర సంవత్సరం ముందు విజయవాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ నేత మ‌ల్లాది విష్ణువ‌ర్థ‌న్ కూడా వైసీపీలో చేరిన తరువాత విజయవాడ వైసిపి గురించి జగన్ ఆలోచనలు మారినట్లు తెలుస్తోంది.

అంతా మారిపోయింది...

అంతా మారిపోయింది...

అంతా మారిపోయింది...ఇలారాధాకు జగన్ తో కొంత గ్యాప్ పెరగడం, దీంతో ఆ సీటు తనకు దక్కడం కష్టమేనని రాధా భావించడం, జగన్ కూడా రాధాకు సీటు ఇవ్వడం విషయమై కాకుండా న్యాయం చేసే విషయం గురించే మాట్లాడటం, ఆ తరువాత ఆ టికెట్ ను మల్లాదికి ఇచ్చేందుకు జగన్ మొగ్గు చూపి, రాధాకు ఆ తరువాత మంచి నామినేటెడ్ పదవి ఇవ్వాలని నిర్ణయించడం ఇదీ జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న తరుణంలోనే కనిపించిన సీన్. కానీ ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ ఇటు టిడిపి, అటు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలపై ప్రకటించిన వార్ తో సీనంతా మారిపోయింది. జగన్ తాజా నిర్ణయం ప్రకారం మల్లాదికే నామినేటెడ్ పోస్టు, రాధాకి విజయవాడ సెంట్రల్ టికెట్ కన్ ఫామ్ అయిందనేది ఆ పార్టీ నేతల టాక్.

ఈ మార్పు...ఎందుకంటే?...

ఈ మార్పు...ఎందుకంటే?...

నిన్నటిదాకా టిడిపికి కొంత...వైసిపి కొంత...జన సేనకు కొంత(ఓటింగ్ శాతాల్లో మార్పు ఉన్నా)గా ఉన్న కాపు ఓటింగ్ పవన్ టిడిపి, ఆ పార్టీ మీడియా అంటూ వాటిపై యుద్దం ప్రకటించడంతో కాపు సామాజికవర్గంలో అత్యధికులు మనుగడ కోసం పోరాటం భావనతో ఏకమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఈ దశలో విజయవాడలో రాధాకు సీటు ఇవ్వకపోతే ఈ నియోజకవర్గంలోనే కాకుండా మిగిలిన చోట్ల కూడా కాపుల నుంచి వైసిపి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, పైగా రాధా వంగవీటి రంగా కుమారుడు కావడం, అదీగాక పవన్ వివాదం నేపథ్యంలో మళ్లీ ఖచ్చితంగా వంగవీటి రంగా పేరు తెరమీదకు రావడం జరుగుతుందనే ఆలోచనతో జగన్ వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు కన్ఫామ్ చేశారని తెలిసింది.

జగన్...ముందుచూపు...

జగన్...ముందుచూపు...

గత ఎన్నికల్లో కాపుల మూలంగా ఒకసారి దెబ్బతిన్న జగన్ మరోసారి అదే దెబ్బ తినకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాపులకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా టిడిపి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని ప్రచారం జరుగుతుండటం, జన సేనకు సహజం గానే కాపుల దన్ను ఉంటుందని భావించడం, ఈ నేపథ్యంలో తాను వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వనట్లయితే అది కాపుల్లో వేరే రకంగా సంకేతాలను పంపి మొత్తానికే దెబ్బ తీస్తుందనే ముందుచూపుతో... లాభం మాట అటుంచి నష్టం జరగకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Pawan Kalyan's latest war was has given unexpected advantage to Vijayawada YCP leader Yangaveeti Radha. That made it possible to get what he wanted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X