వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల కరోనా రిలీఫ్ ఫండ్ కు, కేంద్రానికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం

|
Google Oneindia TeluguNews

కరోనాపై పోరాటంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నేను సైతం అంటున్నారు. ప్రజలకు కరోనా నుండి కాపాడుకోవటానికి ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పటమే కాదు ప్రధాని మాట విందాం అని మాద్దు పలికారు పవన్ కళ్యాన్ . మొన్నటికి మొన్న జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించిన జనసేనాని కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో అందరం సమైక్యంగా పోరాటం సాగించాలని సూచించారు. అంతే కాదు కరోనా రిలీఫ్ ఫండ్ కు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు .

Recommended Video

Pawan Kalyan & Trivikram Huge Donation To PM Releif Fund , TS & AP Government

లాక్ డౌన్, కరోనా నియంత్రణ పై ప్రధాని చెప్పింది విందాం .. జనసేనాని పవన్ కళ్యాణ్లాక్ డౌన్, కరోనా నియంత్రణ పై ప్రధాని చెప్పింది విందాం .. జనసేనాని పవన్ కళ్యాణ్

కరోనా నియంత్రణకు యుద్ధం చేస్తున్న భారత్

కరోనా నియంత్రణకు యుద్ధం చేస్తున్న భారత్

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. ఇక కరోనా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 21,295 మంది మరణించారు. భారత దేశం మీద కూడా కరోనా ప్రభావం ఉంది .ఇండియాలో 600లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టటానికికేంద్రం దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కరోనాపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. ఇక ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటానికి రాజకీయ ప్రముఖులు , వ్యాపారవేత్తలు తమ వంతు సాయం అందిస్తున్నారు.

కేంద్రానికి కోటి, తెలుగురాష్ట్రాలకు కోటి విరాళం

కేంద్రానికి కోటి, తెలుగురాష్ట్రాలకు కోటి విరాళం

ఇక మొదట నుండి మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కరోనాపై యుద్ధం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షలు చొప్పున కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇక ఆయన ఈ డబ్బును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయబోతున్నారు. అదే విధంగా పీఎం సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

 భారీ విరాళం ప్రకటించి ఔదార్యం చాటుకున్న పవన్

భారీ విరాళం ప్రకటించి ఔదార్యం చాటుకున్న పవన్

గతంలో పవన్ కళ్యాణ్ అమర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశానికి కోటి , తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల రూపాయల విరాళం ఇచ్చారు. ఇక ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు . ఇక తను చేసిన ట్వీట్ లో మోడీ నిర్ణయం సరైనదని ఆయన పేర్కొన్నారు .ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శప్రాయమైన మరియు ఉత్తేజకరమైన నాయకత్వం నిజంగా ఈ దేశాన్ని ఈ కరోనా మహమ్మారి నుండి కాపాడుతుంది అని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు .

English summary
Janasena Party chief Pawan Kalyan, who welcomed Modi's decision from early on, has announced a donation of Rs 50 lakh to the Telugu states for Corona relief fund. He is also going to hand over the money to the Chief Ministers of Telugu states. Similarly, the PM relief fund has been announced one crore rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X