పొత్తుపై పవన్ కళ్యాణ్ తాజావ్యాఖ్యలు; ఏపీలో బీజేపీ, టీడీపీ సఖ్యతకు మార్గం సుగమం చేస్తుందా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరో మారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగించుకుని మంగళగిరి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ రెడ్డీ! ప్యాక్ యువర్ బ్యాగ్స్.. నీ ఖేల్ ఖతం; ఆ వీడియోతో వంగలపూడి అనిత టార్గెట్!!

ఓట్లు చీలనివ్వను.. బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తా: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు ఓట్ల చీలిక విషయంలో బీజేపీ హైకమాండ్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఏ విధంగా అయితే బీజేపీని ఒప్పించానో, అలాగే ఓట్లు చీలకుండా బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

టీడీపీ విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని పవన్ ఒప్పిస్తారా ? ఆసక్తికర చర్చ
దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో బీజేపీని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాయని అధికార వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో పొత్తు పరిస్థితి ఏంటి అని పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బిజెపి అధినాయకత్వాన్ని ఒప్పించే టీడీపీని కూడా కలుపుకొని ఎన్నికల్లో వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ , చంద్రబాబు పొత్తులపై టార్గెట్ చేస్తున్న వైసీపీ
ఇక తెలుగుదేశం పార్టీతో, పవన్ కళ్యాణ్ ని కలిసి పని చేస్తారని, చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సరైన పొలిటికల్ ఫిలాసఫీ లేదని అందుకే చంద్రబాబు తో కలిసి ఎన్నికల సమరం చేస్తారంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి ఎన్నికలకు వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని డైరెక్ట్ గా ప్రకటన చేయనప్పటికీ, వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం అదేనని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఓట్లు చీలనివ్వం అంటే వైసీపీ నేతల భయమెందుకు?
ఓట్లు చీలనివ్వం అన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో టిడిపి చాలాచోట్ల గెలిచే అవకాశం ఉన్న దగ్గర, జనసేన ఆ ఓటు బ్యాంకును పంచుకున్నట్లుగా కనిపించింది. ఇక జనసేన పార్టీలో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఉంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు వచ్చేవి అన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పొత్తులపై వైసీపీ ఉలిక్కిపడుతుంది అన్న అభిప్రాయం జనసేన, టీడీపీలలో వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు బీజేపీ, టీడీపీల సఖ్యత కు బాటలు వేస్తుందా?
ఇక రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, బిజెపికి మధ్య సయోధ్య లేని పరిస్థితులలో, పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు బీజేపీ, టీడీపీ ల సఖ్యత కు బాటలు వేస్తుందా ? బిజెపి అధినాయకత్వాన్ని టిడిపి విషయంలో భవిష్యత్ రోజులలో పవన్ కళ్యాణ్ ఒప్పించడంలో సక్సెస్ అవుతారా? అన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో మరోమారు చర్చకు కారణమయ్యాయి.