వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాంగ్ మార్చ్ కు అనుమతి ఉందన్న పవన్.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న జనసేనాని

|
Google Oneindia TeluguNews

విశాఖ వేదికగా రాష్ట్రంలో ఇసుక కొరతతో ఇబ్బందిపడుతున్న నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం కోసం జనసేనాని లాంగ్ మార్చ్ పేరుతో సమర శంఖం పూరించారు. అయితే జనసేనాని తలపెట్టిన లాంగ్ మార్చ్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక పోలీసులు అనుమతించలేదు అన్న ప్రచారాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఖండించారు.

ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భనవ నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపే లక్ష్యంతో జనసేన నవంబర్ 3వ తేదీన విశాఖలో తలపెట్టిన 'చలో విశాఖపట్నం' లాంగ్‌ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేశారు . కావాలనే కొందరు కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి, జనసేన మద్దతుదారులు రాకుండా చెయ్యటం కోసం ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని,అనుమతి లేదంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 Pawan Kalyans long march permission givem by police ... pawan tweet

ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఛలో విశాఖపట్నం కార్యక్రమం జరిపి తీరుతామని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున అందరూ విశాఖ లాంగ్ మార్చ్ కు వచ్చి తమ మద్దతు తెలియజేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. లాంగ్ మార్చ్ నిర్వహణ కష్టమని, అనుమతి నిరాకరణ అని జరుగుతున్న ప్రచారానికి ఆయన ట్వీట్ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక అంతే కాదు అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి విశాఖలో మద్దిపాలెం జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

రాష్ట్రంలోని ఇసుక కొరతతో, జీవన ఉపాధి కోల్పోయిన 35 లక్షల మంది కార్మికుల గొంతు జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ ద్వారా ప్రభుత్వానికి వినిపిస్తామన్నారు. లాంగ్‌ మార్చ్‌ యథావిధిగా జరుగుతుందని, కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి సంశయం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడమే కాకుండా, పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న పత్రాన్ని కూడా పోస్ట్ చేశారు. ఇక రేపు లాంగ్ మార్చ్ పేరుతో సమరశంఖం పూరించ నున్నట్లు పవన్ పోస్టుతో ఒక క్లారిటీ వచ్చింది.

English summary
There is a large-scale campaign that the police have refused permission for a long march to confront Janasena. Pawan Kalyan's Twitter account condemned the Janasena campaign for not allowing the police Permission given by Visakhapatnam Police for ‘ Long March’ on 3rd Nov 2019 to highlight the woes of 3.5 million construction workers & I appeal to Party leaders,cadre, supporters & Janasainiks not to fall for false news getting circulated by YCP Govt that there is no permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X