• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ 'ఆపరేషన్' ప్రారంభించారా? నాదెండ్ల మనోహర్‌తో భేటీకి ఇదీ కారణం!

By Srinivas
|

అమరావతి: ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఇది చర్చనీయాంశంగా మారింది. జనసేనాని విజయవాడలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉన్న విషయం తెలిసిందే. పవన్, సీఎం చంద్రబాబులు శుక్రవారం దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే.

  హైదరాబాద్ లో పవన్, నాదెండ్ల మనోహర్ భేటి

  ఈ కార్యక్రమం అనంతరం శనివారం నాదెండ్ల మనోహర్ జనసేనానితో భేటీ అయ్యారు. అమరావతికి షిప్ట్ అయిన పవన్ కళ్యాణ్.. ఇక పార్టీపై ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే నాదెండ్లతో భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. అంతే కాదు సీఎం చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ అయిన కమ్మ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

  వారి భేటీ వెనుక కారణం ఇదీ

  వారి భేటీ వెనుక కారణం ఇదీ

  పవన్ కళ్యాణ్‌తో నాదెండ్ల మనోహార్‌‌తో పాటు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కూడా భేటీ అయ్యారు. విజయవాడ పటమటలంకలోని పవన్‌ ఇంటికి వచ్చిన వారిరువురు దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. రాజధానిలో నూతనంగా నిర్మించిన దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరైనందున కృతజ్ఞతలు తెలిపేందుకే పవన్‌ను కలిసినట్లుగా తెలుస్తోంది. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. అలాగే ఆదివారం జరగనున్న స్వామివారి కల్యాణ మహోత్సావానికి రావాలని పవన్‌ను ఆహ్వానించారట.

  వారి నేతృత్వంలో శిక్షణ తరగతులు

  వారి నేతృత్వంలో శిక్షణ తరగతులు

  జనసేన బూత్‌స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల ఆఖరు నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రజల్లో కొనసాగుతున్న భేదాభిప్రాయాలు, వైషమ్యాలను తొలగించడానికే ఈ ప్రయత్నమని చెప్పారు. పార్టీ రాజకీయ వ్యూహాకర్త దేవ్‌ బృందం, జనసేన తరఫున బొమ్మదేవర శ్రీధర్‌లు ఈ శిక్షణ తరగతులను పర్యవేక్షిస్తారని చెప్పారు.

   వారి నేతృత్వంలో శిక్షణ తరగతులు వేరేవిదంగా అన్వయించడం సరికాదు

  వారి నేతృత్వంలో శిక్షణ తరగతులు వేరేవిదంగా అన్వయించడం సరికాదు

  1977లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా మధ్యతరగతి మేధావులు పోరాడారని, మాతృభూమి కోసం వారి భాగస్వామ్యం అవసరమని, రాజకీయ వైరుధ్యాలను నేను విధానపరంగా చూస్తానే తప్ప వ్యక్తిగతంగా చూడనని, వైసీపీ, టీడీపీలలో ఈ అంశం లోపించడంతోనే అసెంబ్లీ సమావేశాలు సరిగా జరగడం లేదని, వైసీపీ, టీడీపీలలో నేను గౌరవించే నాయకులకు తనదొక విన్నపమని, ఏదైనా సందర్భంలో మీరు నన్ను కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా మీ పార్టీ నాయకుల యోగక్షేమాల గురించి వాకబు చేసిన దాన్ని వేరే విధంగా అన్వయించడం సరికాదన్నారు.

  ఇక ఎక్కువగా అమరావతిలో!!

  ఇక ఎక్కువగా అమరావతిలో!!

  పవన్ కళ్యాణ్ విజయవాడలో అద్దె ఇల్లు తీసుకోవడం ద్వారా ఇక ఎక్కువగా ఏపీలోనే ఉంటానని జనసేనకు, ప్రజలకు చెప్పకనే చెప్పారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పవన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాజధానికి కుటుంబంతో సహా తరలి వెళ్లారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Former Speaker Nadendla Manohar’s meeting with Jana Sena chief Pawan Kalyan in Amaravati has raised eyebrows. Pawan Kalyan’s two-day tour of Vijayawada has also made the ruling Telugu Desam sit up. Though Pawan Kalyan and Chief Minister Chandrababu Naidu both attended a programme at a temple in Namburu in Guntur district they did not speak with each other. The Jana Sena chief has indicated to his party cadres and leaders that he will be mostly staying in the capital Amaravati till the elections are over.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more