వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలుసా ? || Oneindia Telugu

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ జనసేన ఏపీలో శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఇక లోక్ సభలో ఖాతా తెరవలేదు .పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో జనసైనికులు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. కనీసం పవన్ కూడా గెలవలేదని ఆవేదనలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తారా అన్న అనుమానం వున్నా వాళ్లకు సమాధానంగా పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నిరాశాజనకంగా ఫలితాలొచ్చినా రాజకీయాలు వీడనని చెప్పిన పవన్

నిరాశాజనకంగా ఫలితాలొచ్చినా రాజకీయాలు వీడనని చెప్పిన పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావడం ఖాయం అని అంతా భావించారు కానీ అది సాధ్య పడలేదు. మార్పు కోరుకున్న పవన్ పార్టీ ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. వారు ముందు నుంచి కోరుకుంటున్న మార్పుకు సంబంధించి రాష్ట్రంలో వారు ఇంకొన్నాళ్ళు బలమైన పోరాటం చేస్తే తప్ప సాధ్యమయ్యేలా లేదని జనసేన శ్రేణులు సహా పవన్ కూడా అనుకుంటున్నారట.అయితే పవన్ మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్థం చెయ్యాలని భావిస్తున్న పవన్

క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్థం చెయ్యాలని భావిస్తున్న పవన్

ఇక తన పార్టీ ఆఫీసులోనో లేక పార్టీ శ్రేణులతో తప్ప ఇంకెక్కడా బయటకు రాలేదు పవన్ కళ్యాణ్. దీనితో జనసేన పార్టీ భవిష్యత్ పై అనేక అనుమానాలు అందరిలో కలిగాయి.కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్తూ పవన్ తాను పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తానని చెప్పుకొచ్చారు.ఇప్పుడు దానికి సంబంధించి భవిష్యత్ రాజకీయాలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.పవన్ ఇప్పటి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.అంతే కాదు క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టం చెయ్యాలని కూడా పవన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

బూత్ స్థాయి కమిటీలు, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యటానికి నడుం బిగించిన పవన్

బూత్ స్థాయి కమిటీలు, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యటానికి నడుం బిగించిన పవన్

గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జనసేన పార్టీ పై పవన్ కళ్యాణ్ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో వారు చేసిన పొరపాట్లు తప్పిదాలను సమగ్రంగా తెలుసుకొని రానున్న రోజుల్లో ఏం చేస్తే బాగుంటుందో అన్నది కూడా పవన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం .పార్టీకి బూత్ స్థాయి కమిటీలు వేయాలని అలాగే గ్రామ స్థాయిల్లో ఎక్కడెక్కడ అయితే వీక్ గా ఉన్నారో అక్కడ పార్టీని మరింత బలోపేతం చెయ్యాలని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ .ముఖ్యంగా గ్రామాల్లోనే వీరి దృష్టి ఉండబోతుంది అని అందుకు తగ్గట్టుగా వారి పార్టీ శ్రేణులు నడుచుకోవాలని పవన్ సూచించినట్టు తెలుస్తుంది. గతంలో పార్టీ రూట్ లెవెల్ లో బలంగా లేని కారణమే తమ ఓటమికి కారణం అని జనసేన భావిస్తుంది. అందుకే గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి ప్రజా క్షేత్రంలో ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. మరి రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలాన్ని పుంజుకుంటుందా లేదా .. పవన్ పార్టీని బలోపేతం చెయ్యటంలో ఈ సారైనా సక్సెస్ అవుతారా అన్నది తేలాల్సి వుంది.

English summary
The Pawan Kalyan post mortem on the JanasenaParty defeat in elections. Information that Pawan's plan is to do what is good in the coming days. Pawan Kalyan wants to strengthen the party where the party is to be booth level and wherever it is at village levels. Pawan has suggested that their party lines should be in line with the fact that their focus is on the villages. Janesena believes that the party is not strongest in root level . That is why Pawan Kalyan has made a sensational decision to strengthen the party from the village level and stay in the public . In the coming days, the Jana Sena Party will have a stronger or whether it will succeed in strengthening the Pawan party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X