• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ పార్టీకి 100 కోట్ల రూపాయల ఫండ్ వెనుక అన్నీ అనుమానాలే !!

|
  జనసేన పార్టీకి నిజంగానే 100 కోట్ల ఫండ్ వచ్చిందా..? || Janasena Got Rs 100 Crores In Funds..?

  పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ పార్టీకి వంద కోట్ల రూపాయల ఫండ్ సేకరించనున్నట్లు పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా ప్రకటించారు. దానికి సంబంధించి పవన్ ఫ్యాన్స్, మరియు జనసేన కార్యకర్తలు తీసుకున్న నిర్ణయంపై ఆయన తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే జనసేన పార్టీకి వంద కోట్ల రూపాయల ఫండ్ సేకరణ అంశం వినటానికి బాగానే ఉన్నా విమర్శలకు దారి తీస్తుందేమో అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగాస్టార్ చిరంజీవి.. అంతెందుకు మెగా ఫ్యామిలీ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ మంచి క్రేజ్ ఉంది. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ల సినిమా అంటే థియేటర్లు నిండి పోవడమే కాదు , అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అంతటి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ పెట్టి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి పార్టీని ఇప్పుడు బలోపేతం చేయడానికి పవన్ ఫాన్స్, జనసేన కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారని వార్త బాగా వైరల్ అవుతుంది.

  Pawan Kalyans party plan behind the Rs 100 crore fund ?

  జనసేన పార్టీకి 100 కోట్ల ఫండ్ సేకరించాలని నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని నాగబాబునే స్వయంగా వివరించారు .జనసేన పార్టీకి 100 కోట్ల రూపాయలను ఫండ్‌గా కేటాయించాలని.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనుకున్నట్లు.. అది విని తాను షాక్‌ అయినట్లు ప్రముఖ నటుడు నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌‌.. 'నా ఛానెల్.. నా ఇష్టం' ద్వారా చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ బోలెడన్ని అనుమానాలకు కారణమవుతుంది. జన సైన్యం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరమైన నిర్ణయమని, అసలు ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీకి.. రాజకీయ నేతలు కానీ.. అభిమానులు కానీ.. ఇలా ఆలోచన చేయలేదని నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. అలాగే తన తమ్ముడి మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూసి చాలా సంతోషం గానూ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

  టార్గెట్ తెలంగాణా అంటున్న కమల దళం .. క్రియాశీల సభ్యత్వంతో కమలదళపతి వ్యూహం

  ఈ ఫండ్ గురించి తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు బ్యాంకుల్లో డబ్బులు వేయడానికి క్యూ కడుతున్నారని ఆ వీడియోలో వివరించారు. ఇక ఇదే సమయంలో చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెట్టారు కానీ జనసేన పార్టీ మాత్రం నిజాయితీగాఎన్నికల బరిలో నిలబడిందని, ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా పోటీ చేశామని ఈ సందర్భంగా వివరించారు నాగబాబు. అయితే జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ జనసేన కార్యకర్తలు 100 కోట్ల ఫండ్ సేకరిస్తామని చెప్పిన విషయాన్ని చాలా రోజుల తర్వాత యూట్యూబ్‌లో ప్రత్యక్ష్యమయిన నాగబాబు వీడియో చూసిన ప్రేక్షకులు, అభిమానులు షాక్ అవుతున్నారు.

  జనసేన పార్టీకి పార్టీని.. అభిమానులను అడ్డం పెట్టుకుని పార్టీ నాయకులు ఆడుతున్న నాటకమని కొందరంటుంటే, మరికొందరు మాత్రం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికే ఈ ప్లాన్ అంటున్నారు. అదలా ఉంటే పార్టీ కోసం డొనేషన్ కలెక్ట్ చేసినమనీని పార్టీ కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ నిజాయితీగా పవన్ పార్టీకి అందిస్తారా? లేకా అది దుర్వినియోగం అవుతుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పార్టీల ఆర్థిక వనరుల విషయంలో జనసేన పార్టీ తరహాలో ఇప్పటివరకు ఎవరూ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జనసైన్యం తీసుకున్నారని చెబుతున్న నిర్ణయం వినటానికి బాగానే ఉన్నా విమర్శలకు కారణమవుతోంది. పలు అనుమానాలకు తావిస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Power Star fans started a campaign on social media #Janasena Donations Day. While many fans are donating generously few are making use of it to siphon funds. It has to be seen whether fans surprise Power Star with Rs 100crs on his birthday .but there is lot of criticism about the 100 crore fund .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more