వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మలేకున్నాం..: ఎస్పీ బాలు మృతిపై పవన్ కళ్యాణ్, నాగబాబు స్పందన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచి మనందర్నీ వదలివెళ్లారు గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. ఆయన లేని సంగీతాన్ని ఊహించలేమంటూ సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక మహా విషాదంగా అభివర్ణిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

వేల పాటలు పాడి.. కోట్లాది అభిమానుల మనసు దోచిన ఎస్పీ బాలు తొలి పాట ఇదేవేల పాటలు పాడి.. కోట్లాది అభిమానుల మనసు దోచిన ఎస్పీ బాలు తొలి పాట ఇదే

త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించాను కానీ..

త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించాను కానీ..

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. బాల సబ్రహ్మణ్యం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. బాలు గారు కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నారని.. అంత బాగానే ఉందని చెప్పడంతో ఆయన త్వరలోనే కోలుకుంటారని ఆకాంక్షించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

బాలు అంటే ప్రత్యేకమైన గౌరవం: పవన్ కళ్యాణ్

సిని పరిశ్రమ, దేశం, సంగీత ప్రపంచం మొత్తం బాలు కోలుకోవాలని ఆశించారు కానీ.. దురదృష్టతవశాత్తు ఆయన.. కోవిడ్ బారిన పడటం చాలా బాధగా ఉంది. మనసును కలిచివేసింది. ఆయన సినిమాలకు సంబంధించినంత వరకు.. ఆయన నా సినిమాల్లో కూడా ఆయన గళం ఇవ్వడం.. అలాగే వారంటే నాకు చిన్నప్పట్నుంచి ప్రత్యేకమైన గౌరవమని చెప్పారు. బాలును తన చిన్నట్నుంచి చూశానని, ఆయన ఇలాంటి స్థితిలో ఆయన పోవడం చాలా బాధగా ఉంది. వారి కుటుంబసబ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

నమ్మలేకపోతున్నానంటూ నాగబాబు..

‘నమ్మలేకుండా ఉన్నా.. ఓ జనరేషన్‌ని జీవింపజేసిన ఆ గొంతుక ఇకలేదని. ఆయన గొంతు నా మొదటి చిత్రం రుద్రవీణతోపాటు ఇతర అనేక సినిమాలను విజయ తీరాలకు చేర్చింది. ఆయన లేనిలోటుతో ఖాళీ అయిన మన హృదయంలోని భాగాన్ని ఆయన మనకందించిన పాటల జ్ఞాపకాలతో నింపేద్దాం. అవి ఎప్పటికీ నిలిచివుంటాయి' అంటూ ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు.

English summary
Pawan Kalyan and Nagababu's response on SP Balu death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X