వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమర సైనికుల కోసం కోటి రూపాయల విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్ ఈ చెక్కును సైనికాధికారులకు అందించనున్నారు. కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి కోటి రూపాయల విరాళాన్ని అందించిన అనంతరం పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం ఇండియన్ స్టూడెంట్ పార్లమెంటు సదస్సులో పాల్గొననున్నారు .

 ఢిల్లీలో జగన్ కలిసింది బీజేపీ నేతలను కాదట .. పొత్తులపై కొత్త లెక్కలు చెప్పిన పవన్ ఢిల్లీలో జగన్ కలిసింది బీజేపీ నేతలను కాదట .. పొత్తులపై కొత్త లెక్కలు చెప్పిన పవన్

 కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయంలో కోటి విరాళం అందజేత

కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయంలో కోటి విరాళం అందజేత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 20వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి రెండు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇటీవల మిలటరీ డే సందర్భంగా అమరులైన సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక విరాళాన్ని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అక్కడ సైనికాధికారులకు అందించనున్నారు.

విజ్ఞాన భవన్ లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొననున్న పవన్

విజ్ఞాన భవన్ లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొననున్న పవన్

ఇక ఆ తర్వాత మధ్యాహ్నం విజ్ఞాన భవన్ లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకుల అవసరాన్ని ఉద్దేశించి నిర్వహిస్తున్న ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ గురించి రూపొందించిన ఒక షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారు. పవన్ యువతను ఉద్దేశించి, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి యువత ఏవిధంగా ముందుకు రావాలో ప్రస్తావిస్తూ సదస్సులో మాట్లాడనున్నారు.

 రాజకీయాల మార్పు కోసం యువత రావాల్సిన అంశంపై పవన్ స్పీచ్

రాజకీయాల మార్పు కోసం యువత రావాల్సిన అంశంపై పవన్ స్పీచ్

అదేవిధంగా విద్యార్థుల సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తారని తెలుస్తోంది. వివిధ పార్టీల నుండి కీలక నాయకులు పాల్గొంటున్న ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నట్లు గా జనసేన పేర్కొంది . ఇక ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. ఒకపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోపక్క ఏపీ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల కోసం పర్యటనలు సాగిస్తూనే, ఇంకోపక్క పలు కీలక కార్యక్రమాలలో సైతం భాగస్వామ్యం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

English summary
Janasena chief Pawan Kalyan to visit Delhi tomorrow. In the national capital of Delhi, Pawan Kalyan participating in two programs. Pawan Kalyan, who donated Rs 1 crore for the Families of Martyrs on miletary day . he will give the cheque to the central sainik board officials and after he will participate in indian student parliament seminar .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X