కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు హైకోర్టు ఏర్పాటు విషయంలో అభ్యంతరం లేదు కానీ ... : పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని తేల్చి చెప్తున్నారు . నిన్నటిదాకా ఏపీ రాజధాని ఒక్క అమరావతినే అని తేల్చిచెప్పిన పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ తాజాగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన: జనసేనతో పాటు బీజేపీ కలిసి సాగుతుందా?పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన: జనసేనతో పాటు బీజేపీ కలిసి సాగుతుందా?

Recommended Video

Pawan Kalyan Angry Speech On Jagan Decision || AP 3 Capitals Issue || Oneindia Telugu
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చెయ్యటంపై పవన్ క్లారిటీ

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చెయ్యటంపై పవన్ క్లారిటీ

ఇక తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ కర్నూలు వాసులు పవన్ పై ఆగ్రహంతో ఉన్న నేపధ్యంలో ఆయన కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చెయ్యటంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇక కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుపై అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే కర్నూలులో హైకోర్టు తాను వ్యతిరేకం కాదని పేర్కొన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కేవలం హైకోర్టుతోనే అభివృద్ధి జరగదని గట్టిగా చెప్పారు .

 పెట్టుబడులు వస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందన్న పవన్ కళ్యాణ్

పెట్టుబడులు వస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందన్న పవన్ కళ్యాణ్

పెట్టుబడులు వస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక నేతలు వాటా అడగడం వల్ల రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు .కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చెయ్యటం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా ? అని ఆయన ప్రశ్నించారు . కర్నూలులో పరిశ్రమలు న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే వస్తాయా ? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అందుకే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదన్నారు.

ఉపాధి లేదనే చదువుకున్న యువకుల ఆవేదన

ఉపాధి లేదనే చదువుకున్న యువకుల ఆవేదన

రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతి సాధిస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. చదువుకున్న యువకులు తమకు ఉపాధి లేదనే ఆవేదన చెందుతున్నారన్నారు పవన్‌ కళ్యాణ్‌. అయితే కియా పరిశ్రమ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకచోట పరిశ్రమ ఏర్పడినప్పుడు అభివృద్ధి చెందాలి అన్న పవన్ కళ్యాణ్ పరిశ్రమల విషయంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పవన్ ప్రకటనతో కర్నూలు జనసైన్యంలో జోష్

పవన్ ప్రకటనతో కర్నూలు జనసైన్యంలో జోష్

అయితే రాయలసీమ లో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి భయపడతారని అందుకు కారణం స్థానిక నేతలు వాటా అడుగుతారేమో అని భయం అని పేర్కొన్నారు పవన్ .ఏది ఏమైనా పవన్ మూడు రాజధానులకు వ్యతిరేకం అని కర్నూలు వాసులు ఆగ్రహంతో ఉన్న సమయంలో కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని చెప్పి పవన్ క్లారిటీ ఇవ్వటం కర్నూలులో పర్యటన చేస్తానని చెప్పటం నిజంగా కర్నూలు జిల్లా జనసైనికులకు మంచి బూస్ట్ ఇచ్చింది .

English summary
Pawan Kalyan, who is currently planned to tour in Kurnool district, has said that he has no objection to setting up a judicial capital in Kurnool. As Kurnool residents are angry with Pawan because he is opposing the three capitals decision . Pawan Kalyan, Jana Sena leader on the creation of legal capital in Kurnool, said that the Kurnool High Court was not a solution for the development . need industrial development in kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X