వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు పవన్ వార్నింగ్..నేను తెగిస్తే: మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కొనే కుట్ర: డబ్బు పంచి అధికారంలోకి..!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికార పార్టీ పేరుతో తీవ్ర ఆరోపణలు చేసారు. జనసన పైన వైసీపీకి ఎందుకింత కక్ష్య అని ప్రశ్నించారు. తమకు ఉన్న ఒక ఎమ్మెల్యేలను లాక్కొనే కుట్ర చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి మీద ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో డబ్బు పంచటం వైసీపీకే సాధ్యమైందని..అందుకే వారు అధికారంలో ఉన్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు లో వేగం ఎందుకు లేదని పవన్ నిలదీసారు. రాపాక మీద అనేక కేసులు పెట్టిన ప్రభుత్వం..కోటంరెడ్డి మీద ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అయితే, చంద్రబాబు సైతం కోటంరెడ్డి గురించి ప్రశ్నిస్తూ..జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ ను ఖండించారు. ఆ కొద్ది సేపటికే పవన్ కళ్యాన్ సైతం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. తనను రెచ్చ గట్టవద్దని...ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించారు.

పవన్ కళ్మాణ్ సంచలన వ్యాఖ్యలు..

పవన్ కళ్మాణ్ సంచలన వ్యాఖ్యలు..

జనసేన అధినేత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏలూరు లోక్ సభ స్థానం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సమీక్ష లో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి గురించి స్థానిక నేతల నుండి ఆరా తీసారు. అనేక మంది నేతలు వైసీపీ పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసిందని పవన్ కు వివరించారు. సామాజిక సమీకరణాల్లోనూ వైసీపీ ముందుందని అందుకే నెగ్గిందని వివరించారు. ఎన్నికల కు పూర్తి స్థాయిలో సమాయత్తం కాకవపోవటం ఓటమికి కారణంగా కొందరు నేతలు వివరించినట్లు సమాచారం. ఇదే సమావేశంలో పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్నికల ముందు పని చేయటం కాదని.. పార్టీ స్థాపించిన తరువాత.. ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన మూడేళ్ల క్రితం నుండే పోరాటాలు చేస్తే గెలిచి ఉండే వాళ్లమని పవన్ వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా తాను మార్పు కోసం పార్టీ ఏర్పాటు చేసానని.. డబ్బుతో రాజకీయం చేయటానికి రాలేదని స్పష్టం చేసారు. ఇక, పలువురు నేతలు వైసీపీ ఎన్నికల సమయంలో ఏ రకంగా వ్యవహరించిందీ పవన్ కు వివరించారు. దీంతో.. పవన్ సైతం వైసీపీ నేతల మీద కీలక వ్యాఖ్యలు చేసారు.

ఒక్క ఎమ్మెల్యేను లొక్కనే కుట్ర..డబ్బు పంచి అధికారంలోకి..

ఒక్క ఎమ్మెల్యేను లొక్కనే కుట్ర..డబ్బు పంచి అధికారంలోకి..

ఎన్నికల సమయంలో డబ్బులు పంచటం వైసీపీకే సాధ్యపడిందని..అందుకే వారు అధికారంలో ఉన్నారంటూ జనసేన అధినేత పవన్ సంచలన కామెంట్ చేసారు. అసలు వైసీపీ అధినేతకు జనసేన అంటే ఎందుకు కక్ష్య అని ప్రశ్నించారు. తమకు ఉన్ని ఒక్క ఎమ్మెల్యేను తమ వైపు లాక్కొనేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యే రాపాక మీద అనేక కేసులు నమోదు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదని పవన్ ప్రశ్నించారు. అదే సమయంలో వైయస్ వివేకా హత్య గురించి పవన్ ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో వేగం ఎందుకు లేదంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పరోక్షంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన ఆరోపణలకు దగ్గరగా పవన్ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే, ఏపీలో తొలి సారిగా వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత ఈ స్థాయిలో వైసీపీ మీద.. ఎన్నికల్లో గెలుపు మీద ఇంత సీరియస్ గా కామెంట్లు చేసారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యల మీద రాజకీయంగా ఆసక్తి కర చర్చ సాగుతోంది.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే పవన్ నోట...

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే పవన్ నోట...

టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన చర్చ సాగుతున్న సమయంలోనే..పవన్ సైతం అదే తరహాలో వ్యాఖ్యలు చేయటం చర్చకు కారణమైంది. ఎమ్మెల్యే రాపాక ఏం చేసారని అరెస్ట్ చేసారని ప్రశ్నించిన చంద్రబాబు ఆయన అరెస్ట్ ను ఖండించారు. కోటంరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. జనసేన ఎమ్మెల్యేకు మద్దతుగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీకి ఒక రకంగా ఇతరులకు మరో రకంగా చట్టం ఉంటుందా అని నిలదీసారు. కాసేపటికే పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహాలో కోటంరెడ్డి గురించి ప్రశ్నించి..రాపాక అరెస్ట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి కొనసాగింపుగా తనను రెచ్చగొట్టవద్దని..తాను ఎంత వరకైనా తెగిస్తానంటూ హెచ్చరించారు. ఇక, ఇప్పుడు పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
Janasena Chief Pawan Klayan sensational comments on CM Jagan. Pawan Says YCP Trying to take his own MLA. He said that YCP won Elections with money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X