వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు ... మరోమారు సీఎం ను టార్గెట్ చేసిన పవన్

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని, అధికార వైసీపీపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భావిస్తున్నాయి. ఇదే క్రమంలో సామాన్యులు కూడా కొనలేనంతగా పెరిగిపోయిన ఉల్లి ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని అటు టీడీపీ , ఇటు జనసేన విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలినాడే రచ్చ ... విద్యుత్ ఒప్పందాలపై మాటల యుద్ధంఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలినాడే రచ్చ ... విద్యుత్ ఒప్పందాలపై మాటల యుద్ధం

ఉల్లి ధరలను నియంత్రించటంలో ఫెయిల్ అని ప్రతిపక్షాల ఆగ్రహం

ఉల్లి ధరలను నియంత్రించటంలో ఫెయిల్ అని ప్రతిపక్షాల ఆగ్రహం


అసెంబ్లీ సమావేశాల తొలి నాడే సమరాన్ని ప్రారంభించాయి ప్రతిపక్ష పార్టీలు. టిడిపి ఉల్లి దండలతో అసెంబ్లీ సమావేశాలకు ముందు నిరసన తెలియజేయగా, ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడుతున్న పవన్ కళ్యాణ్ ఉల్లి ధరల నియంత్రణలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కార్ పై మండిపడిన పవన్ కళ్యాణ్ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు కానీ జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చేయదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 ఉల్లి ఎందుకు సిల్లీగా అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన పవన్

ఉల్లి ఎందుకు సిల్లీగా అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన పవన్

అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా అంటూ... దాని రేటు పెంచేశారు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉల్లి ధరల నియంత్రణకు గాని, సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ప్రజల నిత్యావసరాల విషయాల్లో చాలా ఘోరంగా విఫలమైనదనడానికి ఇదే కారణమంటూ ఉల్లిపాయల కోసం బారులు తీరిన ఫోటో ఉన్న ఓ పేపర్ క్లిప్పింగ్ ను పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో సర్కార్ విఫలం అని వ్యాఖ్యలు

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో సర్కార్ విఫలం అని వ్యాఖ్యలు

ఇక ఇటీవల రాయలసీమ లో పర్యటించిన పవన్ కళ్యాణ్ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని తీవ్రంగానే విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పెరిగిన ఉల్లి ధరలతో వ్యాపారులు లాభపడుతున్నారు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని, అటు వినియోగదారులు సైతం విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.

నేటి నుండే అసెంబ్లీ సమావేశాలు .. జగన్ టార్గెట్ గా పవన్ ఏం చేస్తారో ?

నేటి నుండే అసెంబ్లీ సమావేశాలు .. జగన్ టార్గెట్ గా పవన్ ఏం చేస్తారో ?


ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు రాష్ట్రంలో నెలకొన్న ఉల్లి సమస్యపై పవన్ కళ్యాణ్ జగన్ టార్గెట్ గా విమర్శలు చేశారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి అంటూ ఎన్ని వాగ్బాణాలు సంధిస్తారో అన్నది ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది.

English summary
Opposition parties started the first rush hour of assembly meetings. pawan sarcastically made posts on AP government .He said that the government had failed to control the prices of onions. Jagan reddy is there for the people's sake there is no need oninons he stated sarcastically .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X