విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ-తెలంగాణ: కులంపై పవన్ సంచలన వ్యాఖ్యలు, నేను చిరంజీవినే వదిలేశా, మరి మీరు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన తాజా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాపక్షం ఉంటే అధికార పార్టీకి మద్దతిస్తానని లేదంటే నిలదీస్తానని స్పష్టం చేస్తున్నారు. బుధవారం విశాఖలో, గురువారం పోలవరం పర్యటనలో, శుక్రవారం విజయవాడ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Recommended Video

Pawan Kalyan Tour : Pawan Kalyan About His Clash With Paritala Ravi

జగన్‌కు మంచి ఛాన్స్, తప్పే, బాబును ఎందుకు నిలదీయట్లేదు, తెలుసుకుంటా: పవన్ నిలదీతజగన్‌కు మంచి ఛాన్స్, తప్పే, బాబును ఎందుకు నిలదీయట్లేదు, తెలుసుకుంటా: పవన్ నిలదీత

చంద్రబాబుకు మద్దతు ఎందుకిచ్చానో పదేపదే వివరణ ఇస్తున్నారు. అలాగే జగన్‌కు మద్దతు ఎందుకు ఇవ్వలేదో చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏపీలో కులపిచ్చిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కంటే ఏపీలో కులపిచ్చి ఎక్కువ అని చెప్పారు.

చిరంజీవిని నాశనం చేశావ్, ఏంచేశాడంటే: పవన్ కళ్యాణ్‌పై రోజా షాకింగ్, అల్లు అరవింద్‌పైనా (వీడియో)చిరంజీవిని నాశనం చేశావ్, ఏంచేశాడంటే: పవన్ కళ్యాణ్‌పై రోజా షాకింగ్, అల్లు అరవింద్‌పైనా (వీడియో)

 కమ్మవారిపై దాడులు బాధించాయి

కమ్మవారిపై దాడులు బాధించాయి

నాడు వంగవీటి రంగాను చంపడం తప్పేనని, అలాగే ప్రతిదాడులు కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఉన్నది కూడా టీడీపీ ప్రభుత్వమే అన్నారు. నిరాధాయుడిని చంపడం తప్పు అన్నారు. దానికి ప్రతీకారంగా అప్పుడు కమ్మకులం వారిపై దాడి చేసినందుకు ఆ బాధ చాలామందిలో ఉండిపోయిందన్నారు.

 చంద్రబాబుకు తెలియకపోవచ్చు

చంద్రబాబుకు తెలియకపోవచ్చు

తనకు టిడిపి నేతలు చాలా అన్యాయం చేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసి ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తాను 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికానని చెప్పారు. టీడీపీ నుంచి ఎన్ని జరిగినా తాను వ్యక్తిగతంగా తీసుకోలేదని చెప్పారు.

 బాబు, జగన్‌లలో ఎవరు బెటరో చూసుకొని మద్దతిచ్చా

బాబు, జగన్‌లలో ఎవరు బెటరో చూసుకొని మద్దతిచ్చా

చంద్రబాబు, జగన్‌లలో ఎవరు బెట్టరో అని చూసుకొని తాను మద్దతు పలికానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కులాల మధ్య ఐక్యత ఉండాలనుకున్నప్పుడు జగన్‌కు మద్దతు ఇవ్వవచ్చు కదా అని కొందరు అనుకోవచ్చునని, కానీ జగన్‌పై అభియోగాలు లేకుంటే తనకు అంతగా ఇబ్బంది ఉండేది కాదన్నారు. కేసులు ఉన్నప్పుడు ఆయనకు మద్దతివ్వకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. అలాగే బాబు అనుభవజ్ఞుడు అన్నారు.

 విజయవాడలో ఇప్పటికీ కులాల ప్రస్తావన

విజయవాడలో ఇప్పటికీ కులాల ప్రస్తావన

విజయవాడలో ఇప్పటికీ కులాల ప్రస్తావన ఉందని పవన్ చెప్పారు. కులాల మధ్య ఐక్యత ఉంటేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. కులాల మధ్య గొడవ లేకుంటేనే అమరావతి ప్రపంచస్థాయి రాజధాని అవుతుందని చెప్పారు. కులాలను విడగొట్టి పాలించే తీరుకు జనసేన వ్యతిరేకమని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి ప్రపంచస్థాయి రాజధాని కావాలన్నా కులాలు, మతాలు లేకుండా అందరూ ఒక్కటి కావాలన్నారు.

కుటుంబం భావన కూడా లేదు, అన్నయ్యను వదిలేశా

కుటుంబం భావన కూడా లేదు, అన్నయ్యను వదిలేశా

నాయకులకు కులం అనే వివక్ష ఉండకూడదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కులం అనేది ఉండకూడదనుకున్నానని చెప్పారు. తనకు కనీసం తన కుటుంబం అనే భావన కూడా లేదన్నారు. అందుకే అన్నయ్య చిరంజీవిని నదిలేసి వచ్చానని చెప్పారు.

అందుకే చంద్రబాబు హైదరాబాద్‌ను తీర్చిదిద్దారు

అందుకే చంద్రబాబు హైదరాబాద్‌ను తీర్చిదిద్దారు

నేను ఇంత చేసినప్పుడు మీ నుండి (కార్యకర్తలు, అభిమానులు) కోరుకునేది కుల వివక్షను తొలగించడమే అన్నారు. అప్పుడు గానీ జనసేన లక్ష్యం నెరవేరదని చెప్పారు. హైదరాబాద్ నగరానికి శతాబ్దాల చరిత్ర ఉందని, కానీ కులాల ప్రస్తావన లేదన్నారు. మంచి వాతావరణం ఉంది కాబట్టే చంద్రబాబు సైబరాబాదును తీర్చిదిద్దగలిగారని చెప్పారు.

 ఝాన్సీలక్ష్మీబాయి లాంటి వారు వస్తారు

ఝాన్సీలక్ష్మీబాయి లాంటి వారు వస్తారు

సీఎంను అయితేనే ప‌రిస్థితులు బాగుపడతాయని, సీఎంను అయితేనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని నాయ‌కుడు చెప్పుకునే సంస్కృతి పోవాలని పవన్ అన్నారు. ప‌ద‌వి ఉన్నా, లేక‌పోయినా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చేసే విధి విధానాలు ఉండాల‌న్నారు. జ‌న‌సేన‌కి మ‌హిళా విభాగం లేద‌ని కొంద‌రు అంటున్నారని, అది కూడా పెడతామని, ఝాన్సీ ల‌క్ష్మీభాయిలాంటి వారు జ‌న‌సేన‌లోకి వస్తారన్నారు. జనసేనకు యువతే రక్తమని చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan said that he have no caste feelings. He said that Telangana is better than AP in caste feelings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X