వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపర భగీరథుడుగా తెలుగు ప్రజల్లో ఆయన చిరంజీవి..!కాటన్ స్ఫూర్తిని కొనసాగించాలన్న పవన్ కళ్యాణ్..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా రూపాంతరం చెందడానికి ఆ మహానుభావుడి కృషి ఎంతో ఉందని సర్ ఆర్థన్ కాటన్ సేవలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. నీళ్ల కోసం అలమటిస్తున్న రోజుల్లో తెలుగు ప్రజల పాలిట ఆపద్బాంధవుడుగా సర్ ఆర్థన్ కాటన్ అవతరించాడని పవన్ కళ్యణ్ అభిరవర్ణించాడు. ప్రకృతి అందించే నీటి కోసం ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్న కాటన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేసారు. జల సంరక్షణ చేసి నేలను సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి, దృఢ సంకల్పమే సర్ ఆర్థర్ కాటన్ ను గోదావరి జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేసారు.

వ్యవస్థలో బాద్యతాయుత రాజకీయాలు రావాలి..!అప్పుడే ప్రజాస్వామ్య గొప్పదనం తెలుస్తుందన్న పవన్..!వ్యవస్థలో బాద్యతాయుత రాజకీయాలు రావాలి..!అప్పుడే ప్రజాస్వామ్య గొప్పదనం తెలుస్తుందన్న పవన్..!

నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి.. అపర భగీరథుడని కాటన్ సేవలను గుర్తు చేసుకున్న పవన్..

నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి.. అపర భగీరథుడని కాటన్ సేవలను గుర్తు చేసుకున్న పవన్..

ఆంధ్రప్రదేశ్ లో విశాలమైన సాగు భూములు ఉన్నప్పటికి పంట పండించడానికి మాత్రం ఏమాత్రం పనికి రాకుండా నిరర్ధకంగా పడిఉండేవి. ప్రధానంగా నీటి కొరతతో పంటలు వేసుకునే వెసులుబాటు లేకుండా ప్రజాలు దిక్కుతోచని పరిస్థితులు వెళ్లదీస్తుండే వారు. ఇలాంటి పరిస్థితులను గమనించిన సర్ ఆర్తర్ కాటన్ మహాశయుడు చలించిపోయినట్టు తెలుస్తోంది. సారవంతమైన నేలకు నీటి సదుపాయం కల్పిస్తే బంగారం పండే అవకాశం ఉందన్న అంవాన్ని గ్రహించిన కాటన్ అపర భగీరథ యత్రాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర పంట పొలాలను సశ్యశ్యామలం చేయాలని కాంక్షినట్టు తెలుస్తోంది.

ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చారు.. ప్రజల గుండెల్లో కాటన్ ఎప్పటికి ఉంటారన్న జనసేనాని..

ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చారు.. ప్రజల గుండెల్లో కాటన్ ఎప్పటికి ఉంటారన్న జనసేనాని..

అందులో భాగంగా ఓ బృహత్కర భగీరథ కార్యక్రమానికి నాంది పలికినట్టు తెలుస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతాగా అభివృద్ది చెందని రోజుల్లో ఓ మహాద్బుత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి తెలుగు ప్రజల్లో ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లోని ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు కాటన్ మహాశయుడు. ఇదే అంశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. కాటన్ దొర జయంతి సదర్బంగా ఆయన తెలుగు ప్రజలకు చేసిన బృహత్కర కార్యక్రమాన్ని, అందుకు సంబంధించిన అనుభవాలను సహచర నాయకులతో పంచుకున్నారు పవన్ కళ్యాణ్.

కాటన్ దొర ముందు చూపుతో రాష్ట్రం సశ్యశ్యామలం.. గోదారి బ్రిడ్జ్ అద్బుతమన్న గబ్బర్ సింగ్..

కాటన్ దొర ముందు చూపుతో రాష్ట్రం సశ్యశ్యామలం.. గోదారి బ్రిడ్జ్ అద్బుతమన్న గబ్బర్ సింగ్..

గోదావరి నదిపై 160ఏళ్ల కిందట కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట వల్లే అక్కడి డెల్టా భూములు నేటికీ సశ్యశ్యామలంగా కళకళలాడుతున్నాయి. ఆ అపర భగీరథుడి జయంతి సందర్భంగా తన తరఫున, జనసైనికుల తరఫున మనఃపూర్వక అంజలి ఘటిస్తున్నానన్నారు జనసేనాని. గోదావరి పుణ్య స్నానం ఆచరించేటప్పుడు సర్ ఆర్థర్ కాటన్ ను స్మరిస్తూ నేటికీ అర్ఘ్యం సమర్పిస్తున్నారంటే ప్రజలు ఆయనకు అర్పించే కృతజ్ఞతాపూర్వక నివాళి అదేనని గుర్తు చేసారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని కాపాడటంతో పాటు, తాగు నీటిని అందించాలంటే కావాల్సింది ప్రజల పట్ల బాధ్యత అనే అంశం కాటన్ జీవితాన్ని చదివితే అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

నేటి తరాలకు కాటన్ స్పూర్తి ప్రధాత.. కాటన్ ఆశయాల కోసం కృషి చేయాలన్న పవన్..

నేటి తరాలకు కాటన్ స్పూర్తి ప్రధాత.. కాటన్ ఆశయాల కోసం కృషి చేయాలన్న పవన్..

కేవలం గోదావరి ప్రాంతంలోనే కాకుండా కృష్ణా తీరం, తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను ఓట్లు కురిపించే సాధనాలుగా భావించే నేటి తరం రాజకీయ నాయకులు, పాలకులు అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పడ్డ తపన గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తేనే ప్రాజెక్టులు కాగితాలపై కాకుండా, కార్యరూపం దాల్చి నిర్మాణాలు పూర్తవుతాయని, దాని ద్వారా దేశం సశ్యశ్యామాలంగా మారుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

English summary
Pawan Kalyan described Sir Arthon Cotton as the patron saint of Telugu people in the days when people was looking for water in AP. Cotton, who is aware of the public's difficulties for the water that nature provides, is reminded of its commitment to an innovative program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X