• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇద్దరు సీఎంల గొడవ ఒక డ్రామా : జగన్ ఇంటికి దగ్గరలోనే అత్యాచారమా : పార్టీకి కొత్త కమిటీలు ..పవన్ కళ్యాణ్..!!

By Lekhaka
|

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్ పైన జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రెండు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా సాగుతున్న జల వివాదం ప్రజలను మభ్యపెట్టేందుకు ఆడుతున్న రాజకీయ నాటకంగా పవన్ అనుమానం వ్యక్తం చేసారు. ఇదంతా వారిద్దరూ ఆడుతున్న డ్రామానా..లేక నిజంగా సమస్య ఉందా అనేది ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు.ఇద్దరు ముఖ్యమంత్రులు తమ మధ్య ఎంతో సఖ్యత ఉందని చెప్పుకున్నారు..అలాంటి వారిద్దరూ గొడవ పడుతున్నారంటే నమ్మశక్యంగాలేదని పవన్ వ్యాఖ్యానించారు.

ఇదే విషయాన్ని కొందరు తెలంగాణ నేతలు అన్నారంటూ గుర్తు చేసారు. తమ పార్టీ పరంగా ఈ అంశం పైన నీటిపారుదల ప్రాజెక్టులు, నీటి వాటాలపై మేధావులు, జల నిపుణులతో సదస్సులు నిర్వహించి సంపూర్ణ అవగాహనతో ఒక విధానం తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో అత్యాచారం జరిగితే ఆ తరువాత దిశ యాప్ విడుదల చేసి రాజకీయాలు చేయటం కాదని..అసలు, అత్యాచారాలు జరగని రాజకీయాలు రావాలని పవన్ వ్యాఖ్యానించారు. తన ఒక్కడి కోసం అయితే ఏదో ఒక పార్టీలో చేరే వాడినని..చిత్తశుద్దితో సమస్యకు పరిష్కారం కోసమే ప్రయత్నం చేస్తున్నానని వివరించారు.

Pawan Kalyan says water disputes issue is both CMs drama

ఇక, నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగ కల్పన పైన హామీ ఇచ్చిందని..అది నెరవేరే వరకూ వారికి అండగా ఉంటామంటూ పవన్ హామీ ఇచ్చారు. ఇందు కోసంత్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. కరోనా సమయం లో సమయంలో బాధ్యతగా ఉండి పార్టీ నడిపించాలనే ఉద్దేశంతోనే ప్రజల మధ్యకు రాలేదని వివరించారు. కొత్త కార్యవర్గంలో మహిళలకు, యువతకు ఎస్సీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశామని పవన్ చెప్పకొచ్చారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మదుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌లను తీసుకున్నారు. లీగల్ సెల్‌కి ప్రతాప్, డాక్టర్ సెల్‌కి రఘు, ఐటీ సెల్‌కి శివరాంలను నియమించారు. చేనేత సెల్‌కి సుభాష్, పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా కల్యాణపు శ్రీనివాస్‌లను నియమిస్తూ జనసేనాని నిర్ణయం తీసుకున్నారు.

  Megastar Chiranjeevi చిక్కుతారా.. చిక్కుల్లో పెడతారా.. ఈసారి ఆచితూచి..!!

  ఇదే సమయంలో ఏపీ లోని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కందుల దుర్గేష్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా గోవింద్ ను నియమించారు.కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ, విజయవాడ అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్, కార్యదర్శిగా అమ్మిశెట్టి వాసులను నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా షేక్ రియాజ్‌లను నియమించారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పి.సి.వర్మ, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పసుపులేటి హరిప్రసాద్‌ లను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

  English summary
  Pawan Kalyan key comments against both telugu states Cm's on water disputes. Pawan says it seem to be a drama.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X