వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయన రావాలి: రామచంద్రయ్య, మరి ఎలా.. నాశనం చెయ్యడమే: పవన్ కళ్యాణ్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరూ జెండాలు, అజెండాలు పక్కన పెట్టాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఉంచి నడిపించాలని కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య బుధవారం నాడు విజ్ఞప్తి చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరూ జెండాలు, అజెండాలు పక్కన పెట్టాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఉంచి నడిపించాలని కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య బుధవారం నాడు విజ్ఞప్తి చేశారు.

చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుగా చంద్రబాబు ప్రభుత్వం తీరు ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వస్తే మన వద్దకే పరిశ్రమలు వస్తాయని, దాని కోసం విదేశీ పర్యటనలు అవసరం లేదన్నారు.

సీఐఐ సదస్సుల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ అనంతపురం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కరపత్రాలను విడుదల చేశారు. 2016లో జరిగిన సీఐఐల సదస్సులో చేసుకున్న ఒప్పందాలు, ఆ సమయంలో ఇచ్చిన హామీలు, అందుకోసం వెచ్చించిన ఖర్చులు తదితర వివరాలను ఇందులో పొందుపర్చారు.

వెన్నుచూపిన నువ్వా: జగన్‌కు ఉమ, ఏం లేవో చెప్పాలని పవన్ కళ్యాణ్‌కు

అనేక పరిశ్రమలు రాష్ట్రంలో ముప్పై శాతం పెట్టుబడులు పెట్టాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇప్పటి వరకు మూడు శాతం కూడా కార్యరూపం దాల్చలేదని రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ మరిన్ని ట్వీట్లు

మరి ఎలా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా - ఆర్కే బీచ్ నిరసన పైన వరుస ట్వీట్లు చేస్తున్నారు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న సామెత లాగా ప్రత్యేక హోదాకి మీరు పోరాటం చెయ్యరు, చేసే వారిని చెయ్యనివ్వరు, మరి అలా అని నిలదీశారు.

యువత చేయాలనుకుంటున్న ప్రత్యేక హోదా శాంతియుత పోరాటాన్ని ఎవరు నీరుగార్చినా, వారు ఏపీ రాష్ట్ర యువత భవిష్యత్తుని నాశనం చెయ్యడమేనని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on Thursday questioned Chandrababu Naidu governemnt who will fight for Special Tag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X