విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమా వాళ్ల దగ్గర అంత డబ్బు ఉండదు...అచ్చెన్నాయుడు లాంటి వాళ్ల దగ్గరే:పవన్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:తిత్లీ తుఫాన్ సహాయక కార్యక్రమాల విషయంలో సిఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తుఫాన్ సహాయక పనుల్లోనూ సిఎం చంద్రబాబు ప్రచారానికి పాకులాడటం తప్పన్నారు పవన్. సహాయక చర్యలు బాగున్నాయని గవర్నర్‌ ప్రశంసించడం తొందరపాటన్నారు. జగన్ తుఫాన్ బాధితులను పరామర్శించకుండా నడకలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. 15 రోజుల్లో కేంద్ర బృందాలు వచ్చి తుఫాన్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్ల దగ్గర కంటే అచ్చెన్నాయుడి వంటి వాళ్ల దగ్గరే ఎక్కువ డబ్బు ఉంటుదని పవన్ వ్యాఖ్యానించారు.

ముందు జాగ్రత్తలో...విఫలం

ముందు జాగ్రత్తలో...విఫలం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖపట్టణంలో ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిత్లీ తుఫాన్ విధ్వంసానికి సంబంధించి సిఎం చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో విఫలం అయ్యారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
"హుద్‌హుద్‌ సమయంలో విశాఖ ప్రజల్ని అప్రమత్తం చేశారు...అయితే అటువంటి ప్రయత్నం శ్రీకాకుళం జిల్లాలో జరగలేదు...తుఫాను షెల్టర్లూ సిద్ధం చేయలేదు. ఇంతకంటే వైఫల్యం ఉందా?...వాటర్‌ ప్యాకెట్లు, బియ్యం, నిత్యావసర సరుకులు ముందుగానే ఇచ్చి ఉంటే బాగుండేది. సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని తెలిసినా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఇప్పటికీ అధికారులు, సిబ్బంది అనేక గ్రామాలకు వెళ్లనేలేదు. అవిచీకట్లోనే ఉన్నాయి"...అని పవన్ దుయ్యబట్టారు.

తుపాను బాధితులకు సాయంపై సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ:కేంద్రం నిర్లక్ష్యం...మేము రూ.1000 కోట్లు ఖర్చు తుపాను బాధితులకు సాయంపై సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ:కేంద్రం నిర్లక్ష్యం...మేము రూ.1000 కోట్లు ఖర్చు

సహాయంలోనూ...ప్రచారమా?

సహాయంలోనూ...ప్రచారమా?

"విపత్తు సమయంలో బాధితులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత...దానిని ప్రచారం చేసుకోవడం తప్పు...సిఎం బూట్లు వేసుకొని గ్రామాల్లో తిరిగి ఆ ఫోటోలతో ప్రచారం చేసుకొంటున్నారు...ముఖ్యమంత్రి నోరు ప్రకటనలు చేస్తోంది. అయితే చేయి మాత్రం కదలడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పని శవాలపై పేలాలు ఏరుకున్నట్లు ఉంది''...అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అయితే తుఫాన్‌ సాయంపై కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందని...ఇటువంటి సమయంలో రాజకీయ కారణాలతో వివక్ష చూపడం మంచిది కాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత ప్రతిష్ఠలకు పోతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పక్షం రోజుల్లో కేంద్ర బృందాలు రావాలి. తుఫాన్‌ బాధితులను ఆదుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ రాస్తున్నాం.

గవర్నర్ తీరు...తొందరపాటు

గవర్నర్ తీరు...తొందరపాటు

తుఫాన్ నష్టంపై నివేదిక తీసుకొని గవర్నర్‌ను కలుస్తాం. తుఫాన్ సహాయక చర్యలు బాగున్నాయని గవర్నర్‌ ప్రశంసించడం తొందరపాటని పవన్ అభిప్రాయపడ్డారు.
తుఫాన్‌ సహాయం అందించడంలో వివక్ష చూపుతున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారని...సాయం పంపిణీలో జన్మభూమి కమిటీల జోక్యం ఎక్కువగా ఉందని పవన్ చెప్పారు. బాధితులకు మానవతా దృక్పథంతో సాయం చేయాలని జనసేన కోరుతుందని, జగన్‌ మాదిరి రోడ్డుపై కాల్చుతామని అనలేదని పవన్‌ వ్యాఖ్యానించారు.

జగన్ బిజీ...డబ్బు వాళ్ల దగ్గరే

జగన్ బిజీ...డబ్బు వాళ్ల దగ్గరే

తుఫాను ప్రభావిత గ్రామాల్లో జగన్‌ పర్యటనకు వెళ్లకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ‘నడకలో బిజీగా ఉన్నారు' అని పవన్ ఎద్దేవా చేశారు. పని చేయడానికి విడిచిపెట్టకుండా సిఎం సమీక్షలతో అధికారులను చంపుతున్నారని పవన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తితలీ తీవ్రతను ప్రపంచానికి తెలిపేలా తాము ఒక డాక్యుమెంటరీ తీశామని పవన్‌ తెలిపారు. సినీ పరిశ్రమను సాయం కోసం అర్థిస్థారా అనే మరో ప్రశ్నకు సమాధానంగా...సినీ పరిశ్రమ తప్పకుండా స్పందించి ఆదుకుంటుందని...అయితే వాళ్ల దగ్గర అంత డబ్బు ఉండదని...డబ్బంతా అచ్చెన్నాయుడు వంటి వారి దగ్గర ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు.

జనసేన...సాయం ఇలా...

జనసేన...సాయం ఇలా...

అనంతరం మాజీ స్పీకర్, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్‌ పర్యటించిన గ్రామాలకు రెండు రకాలుగా సాయం చేస్తామని చెప్పారు. మంగళవారం నుంచి ఏడు బృందాలు విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందిస్తారని...అలాగే వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. ఇంకా మంచినీరు, దుప్పట్లు, ఇతర వస్తువులతో కిట్లు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా బోర్లు వేసి, పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పెడతామన్నారు.

వినూత్నం...జనసేన దీక్షకులు

వినూత్నం...జనసేన దీక్షకులు

ఇదిలావుంటే అయ్యప్ప, భవానీ, సాయి దీక్షల మాదిరిగా తూర్పు గోదావరిజిల్లా కడియంలో జనసేనపార్టీ కార్యకర్తలు ‘జనసేన దీక్ష' చేపట్టడం ఆసక్తికరంగా మారింది. సోమవారం తొలిసారిగా జనసేన కార్యకర్తలు ఈ దీక్షని చేపట్టారు. దీక్షలో భాగంగా తెల్లని చొక్కా, లుంగీ ధరించి, మెడలో ఎరుపు తువ్వాలు వేసుకున్నారు. 21రోజుల ఈ దీక్షలో తాము ఇంటింటికీ వెళ్లి జనసేన పార్టీ విధానాలు, మెనిఫెస్టోపై వివరించడంతోపాటు ఓటు లేని వారికి నమోదు చేస్తామని ఈ జనసేనానులు వివరించారు.

English summary
Visakhapatnam:Janasena Chief Pawan Kalyan has made sensational comments on the manner of AP CM Chandrababu and the state government over Titli cyclone relief efforts. He spoke to the media in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X