వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్! బాబును ఎందుకు అడగరు: మళ్లీ 'కత్తి' దూశాడు, రాజాసింగ్‌పైనా...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫెర్రీఘాట్ ప్రమాద ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మహేష్ కత్తి మరోసారి ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసే విషయంలో ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

Recommended Video

Pawan Kalyan Vishakhapatnam tour : Kathi Mahesh hot comments | Oneindia Telugu

పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసిన తనపై వ్యాఖ్యల చేసిన తెలంగాణ బిజెపి శాసనసభ్యుడు రాజాసింగ్‌పై కూడా మహేష్ కత్తి దూశారు. పవన్ కల్యాణ్‌పై దాడి చేసే విషయంలో కత్తి మహేష్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

 చట్టం తెలియని ఎమ్మెల్యే నాపై..

చట్టం తెలియని ఎమ్మెల్యే నాపై..

తనపై కేసు నమోదు చేయాలని అన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహేశ్‌ కత్తి తీవ్రంగా స్పందించారు. చట్టం తెలియని ఒక ఎమ్మెల్యే తన మీద ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఏమీ కాదని అన్నారు. ఎవరు కంగారు పడవద్దని ఆయన అన్నారు. ఆ ఫిర్యాదు చెల్లదని, అది అసలు కేసే కాదని అభిప్రాయపడ్డారు. తనకు చట్టాల గురించి బాగా తెలుసంటూ పోస్ట్ పెట్టారు.

 మహేష్ కత్తిపై రాజాసింగ్ ఇలా..

మహేష్ కత్తిపై రాజాసింగ్ ఇలా..

గతంలో చౌకబారు ప్రచారం కోసం మహేశ్‌ కత్తి ప్రధాని మోడీని నరహంతకుడితో పోల్చాడని వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ ట్వీట్‌ చేశారు. జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే క్రమంలో మహేశ్‌ కత్తి మోడీని నరహంతకుడితో పోల్చిన విషయం తెలిసిందే.

 ఏ మాత్రం తగ్గని కత్తి

ఏ మాత్రం తగ్గని కత్తి

ఇంతవరకు కేవలం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యం చేసుకుని మహేష్‌ కత్తి తాజాగా మోడీ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. మణిశంకర్ అయ్యర్ అన్నాడని, మోదీ రుజువు చేసుకున్నాడని ఆయన అన్నారు. మణిశంకర్‌ది బాధ్యత లేని వాగుడు అని, మోడీది బాధ్యత మరిచిన సణుగుడు అని ఆయన వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు రాజీనామా ఎందుకు అడుగరు..

చంద్రబాబు రాజీనామా ఎందుకు అడుగరు..

నిజమే...ఎక్కడో రైలు దుర్ఘటన జరిగితే లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రాజీనామ చెయ్యాలో అని మహేష్ కత్తి అన్నారు. ఒకసారైనా రిజైన్ చెయ్యమని కోరకూడదా పవన్ కళ్యాణ్! అని ప్రశ్నించారు.

English summary
Mahesh Katti once again comments against Jana Sen Chief Pawan Kalyan and also on Telangana BJP MLA Raja Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X