• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చాన్నాళ్లకు ఒకే వేదికపై పవన్-చంద్రబాబు: 'శ్రీవారి ఆభరణాలపై.. మీ వ్యవహారం దేశమంతా చూస్తోంది'

By Srinivas
|
  పింక్ డైమండ్ పై చంద్రబాబు ను ప్రశ్నించిన పవన్

  అమరావతి: చాన్నాళ్ల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. శుక్రవారం గుంటూరు సమీపంలో జరగనున్న దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.

  ఇక్కడి లింగమనేని టౌన్ షిప్ పక్కనే నూతన దేవాలయ నిర్మాణం ఇటీవల పూర్తయింది. దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. నాలుగు ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించగా గుడిలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భారత దేశంలో దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహమున్న తొలి దేవాలయం ఇదే.

  రంగంలోకి దిగుతా, మీ థియరీ ప్రకారం: అమరావతి టు పింక్ డైమండ్.. బాబును దులిపేసిన పవన్, హెచ్చరిక

  విజయవాడకు పవన్ కళ్యాణ్ రాక

  విజయవాడకు పవన్ కళ్యాణ్ రాక

  వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్‌ కళ్యాణ్‌ గురువారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం గన్నవరం వచ్చారు. నేరుగా అక్కడి నుంచి కారులో విజయవాడ వెళ్లారు. ఇక్కడ మూడు రోజుల పాటు ఉంటారు. పవన్‌ రాక తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు.

   ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అద్దె ఇంట్లోకి

  ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అద్దె ఇంట్లోకి

  అమరావతితో పాటు ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పవన్ విజయవాడలో ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. పటమటలో ఉన్న సువిశాలమైన ఈ ఇంట్లోకి పవన్ సతీసమేతంగా శుక్రవారం గృహ ప్రవేశం చేస్తారు. పవన్ నాగార్జున యూవర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో దాదాపు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్కడ తన ఇంటిని, కార్యాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతోనే అద్దె ఇల్లు తీసుకున్నారు.

  రమణదీక్షితులు దీక్షకు రాజకీయ నాయకులకు భయమెందుకు?

  అంతకుముందు, పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంటులో గురువారం సాయంత్రం కూడా వరుస ట్వీట్లు పెట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల కోసం రమణదీక్షితులు దీక్ష చేస్తానంటే రాజకీయ పార్టీలకు లేదా వ్యక్తులకు భయం ఎందుకని జనసేనాని ప్రశ్నించారు. ఆయన దీక్షకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు.

  పింక్ డైమాండ్ విషయంలో ఆ రెండు పార్టీల్లో కదలికలేదేం?

  పింక్ డైమాండ్ విషయంలో ఆ రెండు పార్టీల్లో కదలికలేదేం?

  టీటీడీ ఆభరణాలు అదృశ్యమైన విషయమై వాస్తవాలు బయటపెట్టాలని కోరుతూ రమణదీక్షితులు గారు దీక్ష చేపడతాననడంపై ఏ రాజకీయ పార్టీ లేదా ఏ వ్యక్తి అయినా ఎందుకు భయపడుతున్నారు? దీక్షకు నేను మద్దతుగా నిలుస్తాను. మనం ఇప్పటికే కోహినూర్ డైమండ్ కోసం పోరాడుతున్నాం. ఓ పక్క తిరుమల శ్రీవారి పింక్ డైమండ్, ఇతర విలువైన ఆభరణాలు అదృశ్యమైనప్పుడు ఈ విషయాన్ని టీడీపీ, వైసీపీలు ఎందుకు అంత మామూలుగా తీసుకుంటున్నాయి? ఆ రెండు పార్టీలు ఈ విషయంలో సీబీఐ విచారణకు ఒత్తిడి తెచ్చే వరకు దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ ఏ విధంగా ప్రతి స్పందిస్తాయా? అనే విషయమై దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.'

  పక్కదారి పట్టించకండి

  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆభరణాలను ఎవరైతే దోచుకుపోయారో, వారికి ఎవరైతే సహకరించారో, వాళ్లందరూ నరకంలో కుళ్లిపోతారు. కలియుగ దైవం బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు. తిరుమల శ్రీవారి నగలు అదృశ్యమైన విషయమై ఇంతకాలం రమణదీక్షితులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ.. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు చూడకండి. జ్యువెల్లరీ పోవడం, రమణదీక్షితులు మౌనం.. ఈ రెండు వేర్వేరు అంశాలు. ఈ అంశాన్ని మీడియా ఇంతకుముందే హైలైట్ చేసింది. కానీ, ఈ అంశాన్ని ప్రభుత్వం పక్కదోవ పట్టించింది. ఈ వ్యవహారం నుంచి ఎటువంటి మచ్చలేకుండా బయటపడమని టీడీపీని కోరుతున్నా' అని పవన్ పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena Party chief Pawan Kalyan on Thursday took to Twitter questioning the silence of the State’s ruling and Opposition parties on proposed nuclear power plant in the North Andhra region and the issue of missing ‘pink diamond’ and jewellery at TTD as alleged by Tirumala’s former chief priest Ramana Dikshitulu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more