వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి లో జ‌న‌సేన ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా అవ‌త‌రించే అవ‌కాశం...

|
Google Oneindia TeluguNews

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోరాట యాత్ర రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌ను స్రుష్టిస్తోంది. అదికార ప్ర‌తిప‌క్ష పార్టీల‌పైన ద‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు ప‌వ‌న్. కేంద్ర ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయించుకోవ‌డంలో చంద్ర‌బాబు ఘోరంగా విఫ‌లం చెందాడ‌ని విమ‌ర్శించారు. అదికార పార్టీని ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేయాల్సిన ప్ర‌తిప‌క్ష పార్టీ నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాద్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ మండిప‌డ్డారు ప‌వ‌న్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెలుపుకు అంద‌రూ శ్ర‌మించాల‌ని పిలుపునిచ్చారు జ‌న‌సేనాని.

Recommended Video

అవనిగడ్డ నుంచి పోటీ చేయనున్న పవన్
ఏపిలో పోరాట యాత్ర‌.. అదికార‌, ప్ర‌తిప‌క్షాన్ని నిల‌దీస్తున్న‌ ప‌వ‌న్

ఏపిలో పోరాట యాత్ర‌.. అదికార‌, ప్ర‌తిప‌క్షాన్ని నిల‌దీస్తున్న‌ ప‌వ‌న్

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాన్ మాట‌ల తూటాల‌కు ప‌దును పెంచారు. మిస్సైల్ లాంటి మాట‌ల‌తో అదికార, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను టార్గెట్ చేస్తున్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాల‌ను ఎక్కు పెట్టి చంద్ర బాబు పై సంధిస్తున్నారు. ప‌దునైన ప‌ద‌జాలంతో ప్ర‌తిప‌క్షాన్ని క‌కావిక‌లం చేస్తున్నారు. కేంద్ర క‌మలనాథుల‌ను సైతం క‌సి తీరా క‌డిగేస్తున్నారు. మొత్తానికి జ‌న‌సేన పోరాట యాత్ర లో అన్నీ తానై ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసే నేత‌గా నిల‌బ‌డ‌తాను త‌ప్ప మోసం మాత్రం చేయ‌నంటూ ప్ర‌జాక్షేత్రంలో ప‌య‌నం కొన‌సాగిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. జ‌న‌సేన పోరాట యాత్ర‌లో ప‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. పోరాట యాత్ర‌లో భాగంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల‌కు వివరిచేందుకు ప‌వ‌న్ ప్ర‌యత్నాలు చేస్తున్నారు. 2014నుండి తాను ఎందుకు తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌త్తు ఇవ్వాల్సి వ‌చ్చిందో. నాలుగేళ్లుగా చంద్ర‌బాబు ఎలాంటి పొర‌పాట్లు చేసారో, ప్ర‌తిప‌క్ష పార్టీగా వైసీపి ఎందుకు విఫ‌లం చెందిందో అన్ని అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు జ‌న‌సేనాని. 2019లో జ‌న‌సేన అదికారం లోకి వ‌చ్చే ఆవ‌శ్య‌క‌త‌ను కూడా వివ‌రిస్తున్నారు.

తొలి రోజు విజ‌య‌వంతం.. క‌నీవినీ ఎర‌గ‌ని స్పంద‌న‌

తొలి రోజు విజ‌య‌వంతం.. క‌నీవినీ ఎర‌గ‌ని స్పంద‌న‌

పోరాట యాత్ర లో భాగంగా ఇచ్చాపురం లో తొలిరోజు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు అన్నీ విజ‌య‌వంతం అయ్య‌యి. ఇచ్చాపురంలో నిర్వ‌హించిన నిర‌శ‌న కవాతుకు ప్ర‌జ‌నుండి ఊహించ‌ని స్పంద‌న ల‌భించింది. క‌వాతు సంద‌ర్బంగా ప‌వ‌న్ ఇచ్చిన ఉప‌న్యాసం అంద‌రిని ఆలోచింప‌జేసింది. తాను తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ప‌రిస్థితుల్లో మ‌ద్ద‌త్తు ఇవ్వాల్సివ‌చ్చిందో., ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు ప‌వ‌న్. విభ‌జ‌న చ‌ట్టంలో పొందు ప‌రిచిన హామీల‌ను నెర‌వేర్చ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలను కూడా ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేసారు జ‌న‌సేనాని. ఇక అదికార‌ పార్టీ బాద్య‌త‌ల‌ను గుర్తు చాయ‌ల్సిన ప్ర‌తిప‌క్ష వైసీపి ఏపిలో పూర్తిగా విఫ‌లం చెందింద‌ని మండిప‌డ్డారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే స‌త్తా చాటొచ్చ‌నే అభిప్ర‌యాన్ని వ్య‌క్తం చేసారు.

చంద్ర‌బాబు, జ‌గ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు, కేంద్రాన్ని కూడా వ‌ద‌ల‌ని జ‌న‌సేనాని..

చంద్ర‌బాబు, జ‌గ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు, కేంద్రాన్ని కూడా వ‌ద‌ల‌ని జ‌న‌సేనాని..

ప‌దును పెంచిన ప‌వ‌న్ ఉప‌న్యాసాల వేడి అదికార, ప్ర‌తిప‌క్షాల‌కు గ‌ట్టిగానే తాకింది. కేంద్రం ఇచ్చిన హామీల‌ను సాదించుకునే క్ర‌మంలో చంద్ర‌బాబు విఫ‌లం చెందార‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌భుత్వాన్ని ప‌రుగులు పెట్టించాల్సిన ప్ర‌తిప‌క్షం అచేతనంగా మిగిలిపోయింద‌ని ప‌వ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. మ‌నుషుల మ‌ద్య కులాల కొట్లాటలను ఉసి గొల్పుతూ ప్ర‌యోజ‌నం పొందాలంటే అది తాత్కాలిక‌మే అతుంద‌ని, అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా ముంద‌కు వెళ్తే స‌మ‌న్యాయం జ‌రుగుతుంద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇచ్చాపురం నుండి చేస్తున్న పోరాట యాత్ర‌కు ప్ర‌జ‌ల‌నుండి పెద్ద యెత్తున మ‌ద్ద‌త్తు ల‌భిస్తోంది. పారాట యాత్ర నిర్వ‌హిస్తూనే స్థానిక స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ జోరుగా స్పందిస్తున్నారు. ఇత‌ర రాజ‌కీయ నాయకులు జ‌న‌సేన పార్టీ గురించి, జ‌న సైనికుల గురించి ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిజస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు.

175 స్థానాల్లో పోటి, ఆద‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి..

175 స్థానాల్లో పోటి, ఆద‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి..

ఒక వైపు యాత్ర చేస్తూనే కార్య‌క‌ర్త‌ల్లో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్య‌ణ్. పోరాట యాత్ర‌ మొద‌టి విడ‌త‌లో భాగంగా ఐదు జిల్లాలు క‌వ‌ర్ చేయ‌నున్న ప‌వ‌న్ పూర్తి స్థాయిలో జ‌నం మ‌ద్య‌లో ఉండ‌బోతున్నారు. రాబోవు సాధార‌ణ ఎన్నిక‌ల్లో మొత్తం 175 స్థానాల్లో పోటి చేస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని త‌న బ‌స్సుయాత్ర‌లు విజ‌య‌వంతం అయితే మాత్రం ఆంద్ర ప్ర‌దేశ్ లో మూడ‌వ ప్ర‌త్యామ్నాయ పార్టీగా అవ‌త‌రించ‌డం ఖాయంగా క‌న‌బ‌డుతోంది. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి గాని, వైయ‌స్ఆర్సీపి గాని మెజారిటి రాక‌పోతే నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ది జ‌న‌సేన వ్యూహంగా క‌నిపిస్తోంది. ఏపిలో ఇంకా పూర్తి స్థాయిలో విస్త‌రించ‌ని జ‌న‌సేన 2019 లో ఎన్ని సీట్ల‌లో గెలిచి ఏ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తుందో చూడాలి.

English summary
janasena chief pawan kalyan started his first phase of porata yatra. he will cover 5 districts in first phase and know the public problems. pawan criticizing both tdp and ysrcp. alleging that tdp and ycp failed to solve the public problems. and chandrababu naidu utterly failed to getting fumds from central.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X