వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చదివితే బాబును నిలదీస్తావేమో: పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ నేత హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాపు రిజర్వేషన్ల అంశం గురించి ప్రశ్నించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టో చదవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది కృష్ణా రావు ఆదివారం సూచించారు.

అదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమానిఅదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమాని

Recommended Video

Pawan Kalyan Speech over Chiranjeevi's CM post

మల్లాది కృష్ణారావు యానాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇటీవల పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఏపీలో పర్యటించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, విజయవాడలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడారు.

 పవన్ కళ్యాణ్ టిడిపి మేనిఫెస్టో చదవాలి

పవన్ కళ్యాణ్ టిడిపి మేనిఫెస్టో చదవాలి

కాపు రిజర్వేషన్లపై కూడా తన విజయవాడ పర్యటనలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ నేపథ్యంలో మల్లాది కృష్ణా రావు స్పందించారు. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ఏం హామీలు ఇచ్చారనే విషయం తెలుసుకునేందుకు పవన్ టీడీపీ మేనిఫెస్టోను చదవాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు ఏం హామీ ఇచ్చారో తెలుసుకోవాలన్నారు.

 పవన్ మౌనం ఎందుకు

పవన్ మౌనం ఎందుకు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదం తెలపడంపై పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం ఏమిటని మల్లాది కృష్ణా రావు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడాలన్నారు.

 పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బయటపడుతుంది

పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బయటపడుతుంది

పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీ ఇచ్చిన హామీలకు సంబంధించిన జాబితాను చూస్తే, చంద్రబాబును ప్రశ్నించేందుకు కారణం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. లేదంటే పవన్ కళ్యాణ్ నిజస్వరూపం త్వరలో బట్టబయలు అవుతుందని హెచ్చరించారు.

 అందరినీ కలుస్తాం

అందరినీ కలుస్తాం

చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలు త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రపతి కోవింద్‌ను, గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారని చెప్పారు. దీనిపై మెమోరాండం సమర్పిస్తారని చెప్పారు. బీసీ కోర్ కమిటీ కూడా చంద్రబాబును కలుస్తుందని చెప్పారు.

English summary
Congress MLA Malladi Krishna Rao on Sunday asked Jana Sena leader Pawan Kalyan to clearly read the promises that AP Chief Minister Chandrababu Naidu had made to BCs in 2014 election manifesto. Krishnarao regretted over Pawan Kalyan's silence on Kapu reservation Bill that was passed by the Andhra Pradesh government recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X